Vennela Kishore: కథానాయకుడు వెన్నెల కిశోర్ లేకుండా 'చారి 111' చిత్ర ప్రచారాలు

ABN , Publish Date - Feb 27 , 2024 | 04:25 PM

'చారి 111' చిత్ర ప్రచారాలు కథానాయకుడు వెన్నెల కిషోర్ లేకుండానే మొదలెట్టేసాడు. కిషోర్ చాలా బిజీగా ఉండటం వలన ఈ సినిమా ప్రచారాలకు రాలేదని ఈ చిత్ర దర్శకుడు కీర్తి కుమార్ తరువాత వివరణ ఇచ్చుకున్నారు.

Vennela Kishore: కథానాయకుడు వెన్నెల కిశోర్ లేకుండా 'చారి 111' చిత్ర ప్రచారాలు
Chari 111 team without the lead actor Vennela Kishore

'వెన్నెల' కిశోర్ కథానాయకుడిగా నటించిన సినిమా 'చారి 111'. 'మళ్ళీ మొదలైంది' ఫేమ్ టీజీ కీర్తీ కుమార్ దర్శకుడు, అదితి సోనీ నిర్మాత. ఇందులో సంయుక్తా విశ్వనాథన్ కథానాయికగా నటించారు. మార్చి 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం ఈ చిత్ర బృందం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆసక్తికరం ఏంటంటే, ఇందులో కథానాయకుడిగా నటించిన వెన్నెల కిషోర్ ఈ ప్రచారంలో లేకపోవటం, రాకపోవటం.

దర్శకుడు టీజీ కీర్తీ కుమార్ తాను తెలుగువాడినని, బెంగళూరులో పదేళ్లు యాడ్ ఫిలిమ్స్ చేసి సినిమాల్లోకి వచ్చానాని చెప్పారు. "ఈ 'చారి 111'కి ముందు 'మళ్ళీ మొదలైంది' సినిమా చేశా. ఆ సినిమాలో వెన్నెల కిశోర్ కమెడియన్ రోల్ చేశారు. ఆయనకు అప్పుడే ఈ సినిమా కథ చెప్పాను, ఆయనకి నచ్చింది, అందుకే షూటింగ్ స్టార్ట్ చేసి పూర్తి చేసాము," అని చెప్పారు. వెన్నెల కిషోర్ గురించి చెపుతూ ఆయన అద్భుతమైన కమెడియన్ అని, అతనికి తాను పెద్ద అభిమానినని చెప్పారు దర్శకుడు కీర్తి కుమార్.

chari111promotions.jpg

ఆయనకు టైలర్ మేడ్ క్యారెక్టర్ చారి. ఇదొక స్పై యాక్షన్ కామెడీ జానర్ సినిమాని చెప్పారు దర్శకుడు. కమర్షియల్ సినిమాలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటుంది. రామ జోగయ్య శాస్త్రి గారితో తన మొదటి సినిమా 'మళ్ళీ మొదలైంది' లో పాటలు రాయించుకోవాలని అనుకున్నాను కానీ, కుదరలేదు. ఈ సినిమాతో కుదిరింది అని చెపుతూ ఈ సినిమా థీమ్ సాంగ్ అతను అద్భుతంగా రాశారు అని చెప్పారు దర్శకుడు. ఈ సినిమా సంగీత దర్శకుడు సైమన్ కె కింగ్, దర్శకుడు కీర్తి కుమార్ బీటెక్ బ్యాచ్‌మేట్స్. ఇద్దరూ కాలేజీ కల్చరల్ యాక్టివిటీస్ బాగా పని చేసేవారని చెప్పారు.

అతను మంచి సంగీతం, నేపధ్య సంగీతం కూడా బాగా ఇచ్చాడు అని ప్రశంసించారు దర్శకుడు. కథానాయకురాలిగా సంయుక్తా విశ్వనాథన్ చాలా యాక్షన్ కూడా చేసింది. నిర్మాత గురించి చెపుతూ అదితి తెలుగులో వరుసగా సినిమాలు చేస్తారని, కంటెంట్ వున్న సినిమాలు తీయాలని ఇక్కడకి వచ్చారని చెప్పారు. ఈ సినిమాని మే నెలలో ముందుగా విడుదల చేయాలని అనుకున్నాం, కానీ నెల రోజుల ముందుగానే అంటే మార్చి 1కి విడుదల చేస్తున్నాం అని చెప్పారు. వెన్నెల కిశోర్ బిజీ ఆర్టిస్ట్, వరుస షూటింగ్స్ ఉండటంతో ఈ విలేకరుల సమావేశానికి రాలేకపోయారు అని దర్శకుడు వివరణ ఇచ్చారు.

Updated Date - Feb 27 , 2024 | 04:25 PM