Mandira : భ‌య‌పెడ‌తానంటున్న.. సన్నీ లియోన్

ABN , Publish Date - Apr 19 , 2024 | 05:51 PM

సన్నీ లియోన్ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ హారర్ కామెడీ చిత్రం రోపొందుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ను మేకర్లు విడుద‌ల చేశారు.

Mandira : భ‌య‌పెడ‌తానంటున్న.. సన్నీ లియోన్
sunny

ప్రస్తుతం హారర్ కామెడీ కాన్సెప్ట్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే సన్నీ లియోన్ ఇది వరకు ఎన్నడూ పోషించని పాత్రలో కనిపించనున్నారు. సన్నీ లియోన్ (Sunny Leone) ప్రధాన పాత్రలో విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద రాబోతోన్న చిత్రం ‘మందిర’(Mandira). కొమ్మలపాటి శ్రీధర్ (Kommalapati Sridhar) సమర్పణలో సాయి సుధాకర్ కొమ్మలపాటి (Sai Sudhakar Kommalapati) నిర్మాతగా రాబోతోన్న ఈ చిత్రానికి ఆర్ యువన్ (RYuvan) దర్శకత్వం వహిస్తున్నారు.


sunny.jpeg

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ను మేకర్లు విడుద‌ల చేశారు. మందిర (Mandira) చిత్రానికి సంబంధించిన టైటిల్, సన్నీ లియోన్ (Sunny Leone) ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సన్నీ లియోన్‌ను ఈ పోస్టర్‌లో గమనిస్తుంటే భయపెడుతూనే కవ్విస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తవ‌గా.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. త్వరలోనే మిగిలిన వివరాలను చిత్ర యూనిట్ ప్రకటించనుంది.

Updated Date - Apr 19 , 2024 | 05:51 PM