Baby: హిందీ రీమేక్‌లో స్టార్‌ కిడ్‌!

ABN , Publish Date - Feb 08 , 2024 | 05:29 PM

‘ 'బేబీ’ సినిమా తెలుగునాట ఎంత సెన్సేషన్ అయిందో తెలిసిందే!  యంగ్‌ హీరో హీరోయిన్ లతో యూత్‌ఫుల్‌ స్టోరీగా సాయి రాజేష్‌ తెరకెక్కించిన ‘బేబీ’ తెలుగులో రేంజ్‌లో హిట్‌ను అందుకుంది. తెలుగులో సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో కూడా రీమేక్‌ చేయాలని మేకర్స్‌ నిర్ణయించుకున్నారు.

Baby: హిందీ రీమేక్‌లో స్టార్‌ కిడ్‌!

'బేబీ’ సినిమా తెలుగునాట ఎంత సెన్సేషన్ అయిందో తెలిసిందే!  యంగ్‌ హీరో హీరోయిన్ లతో యూత్‌ఫుల్‌ స్టోరీగా సాయి రాజేష్‌ తెరకెక్కించిన ‘బేబీ’ తెలుగులో రేంజ్‌లో హిట్‌ను అందుకుంది. తెలుగులో సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో కూడా రీమేక్‌ చేయాలని మేకర్స్‌ నిర్ణయించుకున్నారు. ముందుగా ‘బేబీ’ హిందీ రీమేక్‌ ప్రీ ప్రొడక్షన్‌ పనులు మొదలయ్యాయని ఇప్పటికే దర్శకుడు సాయి రాజేష్‌.. ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. ఇప్పుడు ఈ రీమేక్‌ గురించి బాలీవుడ్‌లో మాత్రమే కాదు.. టాలీవుడ్‌లో కూడా హాట్‌ టాపిక్‌గా మారింది. హిందీలో రీమేక్‌ అవ్వనున్న ‘బేబీ’కి కూడా సాయి రాజేషే దర్శకత్వం వహించనున్నారట. కథలో పెద్దగా మార్పులు, చేర్పులు చేయాలనే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. తెలుగులోలాగే యథాతథంగా తెరకెక్కంచనున్నారని మేకర్స్‌ నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. 'బేబి’ని ఎస్ కె యెన్  హిందీలో రీమేక్‌ను కూడా ప్రొడ్యూస్‌ చేయడానికి సిద్థమవుతున్నాడు. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా తెలుగులో బ్లాక్‌బస్టర్‌ అయింది. అదే కంటెంట్‌తో తీసిన హిందీ రీమేక్‌ ‘కబీర్‌ సింగ్‌’ కూడా అదే రేంజ్‌లో ప్రేక్షకులను అలరించింది.  'బేబి’ రీమేక్‌ కూడా అదే విజయాన్ని అందుకుంటుందని నిర్మాత ఎస్‌కేఎన్‌ ధీమా వ్యక్తం చేశారు. 

Kushi.jpg

ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. హీరోల కంటే ఆమెకే ఎక్కువ  మార్కులు పడ్డాయి. యూట్యూబ్‌తో కెరీర్‌ ప్రారంభించిన వైష్ణవి ఈ చిత్రంలో పాపురల్‌ అయిపోయింది. ఇక హిందీలో ఈ  పాత్రను చేయడానికి స్టార్‌ కిడ్‌ను సెలక్ట్‌ చేశారట మేకర్స్‌. తను మరెవరో కాదు.. శ్రీదేవి వారసురాలు ఖుషి కపూర్‌. ఎస్‌కేఎన్‌తో పాటు బోనీ కపూర్‌ గానీ, కరణ్‌ జోహార్‌ గానీ.. ఈ రీమేక్‌ను నిర్మించడంలో భాగం అవ్వనున్నారని టాక్‌. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్‌.. హీరోయిన్‌గా బాలీవుడ్‌లో అడుగుపెట్టి పాపులారిటీ తెచ్చుకుంది. ఇప్పుడు అదే బాటలో ఖుషి కపూర్‌ కూడా వెళ్తోంది. ‘ది ఆర్చీస్‌’ అనే వెబ్‌ ఫిల్మ్‌తో ప్రేక్షకులను పలకరించింది ఖుషి.  


Updated Date - Feb 08 , 2024 | 05:30 PM