Krishna Vamsi: 'హనుమాన్' కంటే 'శ్రీ ఆంజనేయం' బావుంది కామెంట్‌కు.. కృష్ణవంశీ స్పందన!

ABN , Publish Date - Feb 12 , 2024 | 05:35 PM

సంక్రాంతి బరి పెద్ద చిత్రాలతో పోటీ పడి భారీ విజయం అందుకుంది ‘హనుమాన్‌’ చిత్రం. పాన్  ఇండియా స్థాయిలో విడుదలై రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టి ఇప్పటికీ విజయవంతంగా నడుస్తోంది. తాజాగా ఈ సినిమా 300 సెంటర్‌లలో 30రోజులు పూర్తి చేసుకుంది.

Krishna Vamsi: 'హనుమాన్' కంటే 'శ్రీ ఆంజనేయం' బావుంది కామెంట్‌కు.. కృష్ణవంశీ స్పందన!

సంక్రాంతి బరి పెద్ద చిత్రాలతో పోటీ పడి భారీ విజయం అందుకుంది ‘హనుమాన్‌’ (Hanuman) చిత్రం. పాన్  ఇండియా స్థాయిలో విడుదలై రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టి ఇప్పటికీ విజయవంతంగా నడుస్తోంది. తాజాగా ఈ సినిమా 300 సెంటర్‌లలో 30రోజులు పూర్తి చేసుకుంది. భారీ వసూళ్లు రాబట్టడమే కాకుండా మరో రికార్డ్‌ సృష్టించింది. ఈ మధ్యకాలంలో 30 రోజులపాటు అదీ 300 కేంద్రాల్లో సినిమా ప్రదర్శించడం అనేది సాధారణ విషయం కాదు. ఈ ఇటీవల కాలంలో హనుమాన చిత్రానికి ఈ ఘనత దక్కింది. (Hamuman Vs Sri anjaneyam)



ఇది కాకుండా ఈ చిత్రం గురించి సోషల్‌ మీడియాలో ఓ చర్చ నడుస్తోంది. గతంలో కృష్ణ వంశీ తెరకెక్కించిను 'శ్రీ ఆంజనేయం’ చిత్రం గురించి ఇప్పుడు పలువురు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. నితిన్‌, ఛార్మి జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో పరాజయం పాలైంది. సినిమా కథ బాగున్నప్పటికీ కొన్ని పాయింట్స్‌కు ప్రేక్షకులను మెప్పించలేదు. అయితే తాజాగా నెటిజన్లు కొందరు 'హనుమాన్‌' కంటే 'శ్రీ ఆంజనేయం' సినిమానే గొప్ప సినిమా అంటూ  కృష్ణ వంశీ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో కామెంట్స్‌ చేస్తున్నారు. కానీ ఆ సినిమా ప్రేక్షకులకు ఎందుకు నచ్చలేదో అంటూ తిడుతూ ఒక పోస్ట్‌ పెట్టాడు. దానికి దర్శకుడు  కృష్ణ వంశీ స్పందించారు. 'ప్లీజ్‌ ప్రేక్షకులను మాత్రం నిందించకండి. వాళ్ల నిర్ణయం ఎప్పుడూ తప్పు కాదు. శ్రీ 'ఆంజనేయం' సినిమా విషయంలో ఎక్కడో తప్పు జరిగింది. ఈ చిత్రంలోని కొన్ని అంశాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. కానీ మీ వ్యాఖ్యలకు కృతజ్ఞతలు’ అని కృష్ణ వంశీ రిప్లై ఇచ్చారు. మరో నెటిజన్‌ శ్రీ ఆంజనేయం చిత్రంలో ఛార్మ పాత్ర చిరాకు పుట్టించేలా ఉందని చెప్పాడు. ఈ కారణంతోనే సినిమా ఫ్ల్లాప్‌ అయిందని తెలిపాడు. అందుకు కృష్ణ వంశీ మాత్రం 'గాడ్‌ బ్లెస్‌ యు’ అని రిప్లై ఇచ్చారు. నిజం చెప్పాలంటే అప్పట్లో ఈ సినిమా ఫ్లాప్‌ కావడానికి ఛార్మి పాత్రే కారణం అని కామెంట్లు చేశారు. మరో నెటిజన్ ఖడ్గం-2 చిత్రం గురించి అడగగా, ఖడ్గం ఒకటే ఉంటుంది. దానికి సీక్వెల్‌ లేదని స్పష్టం చేశారు కృష్ణవంశీ. 

Updated Date - Feb 12 , 2024 | 05:35 PM