'మా ఊరి పొలిమేర'లో చేసిన హీరోయిన్ ని చూసారా, చూస్తే షాకవుతారు

ABN , Publish Date - Jan 10 , 2024 | 03:36 PM

'మా ఊరి పొలిమేర 2' లో ఒక పల్లెటూరి అమ్మాయిలా కనిపించే కామాక్షి భాస్కర్ల నిజ జీవితంలో ఒక డాక్టరు. ఆమె సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఫోటోస్ చూస్తే ఆమేనా ఈ పల్లెటూరి అమ్మాయిగా కనిపించేది అని షాకవుతారు.

'మా ఊరి పొలిమేర'లో చేసిన హీరోయిన్ ని చూసారా, చూస్తే షాకవుతారు
Kamakshi Bhaskarla

కామాక్షి భాస్కర్ల 'మా ఊరి పొలిమేర' అనే సినిమాతో బాగా ప్రాచుర్యం పొందారు. అంతవరకు ఆమె చిన్న చిన్న పాత్రలు చేసినా ఈ సినిమాలో ఆమె చేసిన పాత్రకి ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. 'మా ఊరి పొలిమేర' అనే సినిమా అప్పట్లో పాండమిక్ ఉండటంతో థియేటర్స్ లో విడుదలవకుండా నేరుగా ఓటిటి లో విడుదలయింది. అక్కడ మంచి విజయం సాధించింది. సత్యం రాజేష్ కథానాయకుడిగా చేస్తే, అతని పక్కన నటించిన కామాక్షి ఇందులో చేసిన నటనకు అందరి ప్రశంసలు పొందింది. అనిల్ విశ్వనాధ్ ఈ సినిమాకి దర్శకుడు.

kamakshibhaskarlahot.gif

స్వతహాగా డాక్టర్ అయిన కామాక్షి 2018లో మిస్ తెలంగాణగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2019 సంవత్సరం నుండి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో ఆమె కనపడ్డారు కానీ అవేవీ ఆమెకి అంత గుర్తింపు ఇవ్వలేకపోయాయి. అయితే మధ్యలో ఆమె డాక్టర్ కోర్సు కూడా పూర్తి చేసి సొంతంగా క్లినిక్ పెట్టుకోవడానికి సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు.

'మా ఊరి పొలిమేర' ఎప్పుడైతే ఓటిటి లో విజయం సాధించిందో అప్పుడో ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని దర్శకుడు విశ్వనాధ్ భావించారు. ఈ సీక్వెల్ థియేటర్స్ లో విడుదల చెయ్యాలని, మొదటి పార్టు కన్నా రెండో పార్టు ఇంకా బాగా అంటే విజువల్స్ అదిరిపోయేట్టు ఉండాలి అనుకోని కథని తయారు చేశారు.

kamakshibhaskarlatradition.gif

అప్పుడు కామాక్షి రెండో పార్టులో అంటే 'మా ఊరి పొలిమేర 2' లో ఒక్క నటిగానే కాకుండా, దర్శకత్వం, రచనలో కూడా పని చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అందుకే రెండో పార్టులో ఆమె కొన్ని మాటలు రాయటమే కాకుండా, కథా రచనలో కూఆ ఆమె భాగం అయింది. అలాగే ఈ సినిమాకి చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ గా కూడా పని చేసింది కామాక్షి.

kamakshibhaskarlahotphoto.gif

2019 నుండి చిన్న చిన్న పాత్రలో కనిపించిన కామాక్షికి ఈ 'పొలిమేర 2' గొప్ప విజయాన్ని అందించింది అనే చెప్పాలి. ఎందుకంటే మొదటి పార్టు ఓటిటి లో విడుదలైంది, అక్కడ చాలామంది చూసారు, కానీ ఆ సినిమాలో కొన్ని రహస్యాలను రెండో పార్టులో చూపించారు. ప్రేక్షకులకి ఆసక్తి ఉండాలనే మొదటి పార్టు అలా పూర్తి చేసాము, మేము అనుకున్నట్టుగానే 'పొలిమేర 2' లో ఆ రహస్యాలను తెలుసుకోవడానికి ప్రేక్షకులు విడుదలైనరోజు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సినిమాని చూసారు అని విజయం గురించి చెప్పారు కామాక్షి.

kamakshibhaskarlatradition.gif

కామాక్షి, నాగ చైతన్య, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'దూత' వెబ్ సిరీస్ లో కూడా ఒక పాత్ర చేశారు. అయితే 'పొలిమేర', 'దూత' వీటన్నిటిలో పాత ఒకేలా ఉంటాయి. 'పొలిమేర' లో పల్లెటూరులో వుండే ఒక స్త్రీలా కనపడతారు, 'దూత' వెబ్ సిరీస్ లో కూడా ఇంచుమించు అలాంటి పాత్రనే చేశారు.

kamakshibhaskarlatraditiona.gif

'పొలిమేర 2' విజయం తరువాత కామాక్షి అన్ని రకాల పాటలు చేయాలన్నదే తన ఆలోచన అని చెప్పారు. ఈ సినిమాతో దర్శకత్వ మెళకువలు తెలుసుకున్న ఆమె ముందు ముందు దర్సకత్వం కూడా చేయొచ్చు అని చెప్పారు. సామజిక మాధ్యమాల్లో కామాక్షి చాలా చురుకుగా వుంటారు. అందులో తన గ్లామరస్ ఫోటోస్ తన అభిమానుల కోసం షేర్ చేస్తూ వుంటారు. ఒకవేళ సినిమాలలో బ్రేక్ తీసుకుంటే డాక్టరుగా ప్రాక్టీసు చేస్తాను అని చెపుతున్నారు.

Updated Date - Jan 10 , 2024 | 03:36 PM