Kiran Abbavaram: 'క' విజయం.. కిరణ్ అబ్బవరం ఎమోషనల్ పోస్ట్ 

ABN , Publish Date - Nov 01 , 2024 | 07:47 PM

దీపావళి  కానుకగా వచ్చి విజయం సాధించిన చిత్రం 'క' . సినిమా సక్సెస్ ను ఆస్వాదిస్తున్న హీరో కిరణ్ అబ్బవరం  ఎమోషనల్ పోస్ట్ చేశారు.   ఎవరికైనా  హిట్ వస్తే హిట్ కొట్టాడు అంటారు కానీ నాకు హిట్ వస్తే హిట్ కొట్టేశాము అంటున్నారు.

Kiran Abbavaram: 'క' విజయం.. కిరణ్ అబ్బవరం ఎమోషనల్ పోస్ట్ 

దీపావళి  కానుకగా వచ్చి విజయం సాధించిన చిత్రం 'క' (KA) . సినిమా సక్సెస్ ను ఆస్వాదిస్తున్న హీరో కిరణ్ అబ్బవరం  (Kiran Abbavaram)ఎమోషనల్ పోస్ట్ చేశారు.   ఎవరికైనా  హిట్ వస్తే హిట్ కొట్టాడు అంటారు కానీ నాకు హిట్ వస్తే హిట్ కొట్టేశాము అంటున్నారు. "క" సినిమా సక్సెస్ కంటే మీరు నాపై  చూపిస్తున్న ఈ ప్రేమ మరింత సంతోషాన్ని ఇస్తోంది. ఇంతమంది ప్రేమ పొందిన నేను అదృష్టవంతుడిని. మీ అందరికీ  కృతజ్ఞతలు" అంటూ కిరణ్ అబ్బవరం తన సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నారు. (KA movie Review)

KA Review: కిరణ్‌ అబ్బవరం కొత్త ప్రయత్నం 'క' ఎలా ఉందంటే


కిరణ్ అబ్బవరం పోస్ట్ కు ఫ్యాన్స్, నెటిజన్స్  స్పందిస్తున్నారు. అన్నా మీరు ఇలాంటి సక్సెస్ కు అర్హులు అని, హిట్ కొట్టేశాము అన్నా అని, లవ్ యూ అన్నా అంటూ రిప్లైస్ వస్తున్నాయి. అలాగే పలువురు స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా కిరణ్ అబ్బవరంకు సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. "క" సినిమా డిఫరెంట్ పీరియాడిక్  థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యింది. కిరణ్ అబ్బవరం హీరోగా దర్శక ద్వయం సుజిత్ - సందీప్ దర్శకులు. 

NTR: నందమూరి కొత్త హీరోకి.. నారా భువనేశ్వరి విషెస్‌


Updated Date - Nov 01 , 2024 | 07:47 PM