Kiran Abbavaram: రూట్‌ మార్చి కొత్త బాటలో..

ABN , Publish Date - Jul 11 , 2024 | 11:15 AM

షార్ట్‌ ఫిల్మ్స్‌తో నటుడిగా కెరీర్‌ ప్రారంభించారు కిరణ్‌ అబ్బవరం.  తర్వాత 'రాజావారు రాణివారు’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. వరుసగా సినిమాలు చేశారు.


షార్ట్‌ ఫిల్మ్స్‌తో నటుడిగా కెరీర్‌ ప్రారంభించారు కిరణ్‌ అబ్బవరం.  తర్వాత 'రాజావారు రాణివారు’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. వరుసగా సినిమాలు చేశారు. ఏడాదికి రెండు, మూడు సినిమాలు ప్లాన్ చేసుకున్నారు. వాటిలో 'ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం' ఒక్కటే సూపర్‌హిట్‌. రొటీన్ కథలే ఎంచుకుంటున్నాడనే టాక్‌తో కొన్ని చిత్రాలు ఆడలేదు. కొంతగ్యాప్‌ తర్వాత ఆయన నుంచి ఓ చిత్రం రాబోతుంది.

KA.jfif

తాజాగా దర్శక ద్వయం సుజీత్‌ -సందీప్‌ అనే ఇద్దరు నూతన దర్శకులతో ఓ చిత్రాన్నిప్రారంభించారు. స్వయంగా నటిస్తూ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ‘క’ అనే టైటిల్‌ను ప్రకటించాడు. పీరియాడికల్‌ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు కిరణ్‌ అబ్బవరం. ఈసారి హిట్టు కొట్టి తీరాలనే ఉద్దేశంతో ఎక్కడా కాంప్రమైస్‌ కాకుండా నిర్మిస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 14న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ వీక్షించిన కొందరు విరూపాక్ష టైపు మిస్టిక్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ‘క’ ఉండబోతుందని చెబుతున్నారు. రెండు ప్రముఖ  డిస్ట్రిబ్యూషన్  సంస్థలు సినిమాను విడుదల చేయబోతున్నాయని టాక్‌ నడుస్తోంది. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Updated Date - Jul 11 , 2024 | 11:15 AM