Thalaivar 171: ర‌జ‌నీ ఈజ్ బ్యాక్.. ఇదెక్క‌డి మాస్ లుక్ రా మామ‌

ABN , Publish Date - Mar 29 , 2024 | 07:50 AM

ఫైన‌ల్‌గా సౌత్ ఇండియాస్‌ మోస్ట్ ఎవైటెడ్ మూవీకి సంబంధించిన కీల‌క అప్డేట్ ఎట్ట‌కేల‌కు వ‌చ్చింది.

Thalaivar 171: ర‌జ‌నీ ఈజ్ బ్యాక్.. ఇదెక్క‌డి మాస్ లుక్ రా మామ‌
rajini 171

ఫైన‌ల్‌గా సౌత్ ఇండియాస్‌ మోస్ట్ ఎవైటెడ్ మూవీకి సంబంధించిన కీల‌క అప్డేట్ ఎట్ట‌కేల‌కు వ‌చ్చింది. గ‌త కొంత‌కాలంగా వార్త‌ల్లో ఉంటూ వ‌స్తున్న ర‌జ‌నీకాంత్ (Rajinikanth) , లోకేశ్ క‌న‌క‌రాజ్ కాంబినేష‌న్ మూవీ ప‌ట్టాలెక్కింది. (Thalaivar 171)గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా గురించి దాదాపు ఆరు నెలుగా సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌గా ఇన్నాళ్లకు ఓ క్లారిటీ రావ‌డంతో ర‌జ‌నీకాంత్‌ (Rajini kanth) , లోకేశ్ ఫ్యాన్స్ అనందంలో మునిగి తేలుతున్నారు.

తాజాగా గురువారం ఈ (Thalaivar 171) చిత్రానికి సంబంధించి లోకేశ్ క‌న‌క‌రాజ్ త‌న సామాజిక మాధ్య‌మం ఎక్స్‌లో ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ పోస్ట‌ర్‌ను పోస్టు చేస్తూ ఏప్రిల్ 22న టైటిల్ రివీల్ చేస‌య‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

171.jpeg

ఈ పోస్ట‌ర్‌లో లగ్జరీ వాచ్‌లను బేడీలుగా చేతికి క‌ట్టేసిన స్టిల్‌లో 1980ల నాటి వింటేజ్‌ రజినీకాంత్ త‌ర‌హాలో లుక్‌ అదిరిపోయింది. ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తోండ‌గా లారెన్స్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌నున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం, అన్బ్ ర‌వి ఫైట్స్ అందిస్తున్నారు.


అయితే.. ఈ చిత్రం టైమ్ ట్రావెల్ క‌థ అని కొంద‌రు, లోకేశ్ సినిమాటిక్ యూనివ‌ర్స్ చిత్రాల‌లోని రోలెక్స్‌కు రిలేటెడ్‌గా ఈ సినిమా ఉండ‌బోతుంద‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి.

ఇదిలాఉండ‌గా జూన్‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలుండ‌గా ఈ ఏడాది చివ‌ర‌కు సినిమాను విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ ఫ్టాన్ చేస్తున్నారు. దీని త‌ర్వాత ‘ఖైదీ 2’ మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో లోకేష్ తెలిపాడు. ర‌జ‌నీకాంత్ న‌టించిన తాజా చిత్రం వెట్ట‌యాన్ Vettaiyan (వేట‌గాడు) ఈ వేస‌విలో విడుద‌ల కానుంది.

Updated Date - Mar 29 , 2024 | 08:07 AM