మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Karthikeya: UV బ్యానర్‌లో కార్తికేయ గుమ్మకొండ మూవీ! ఫస్ట్ లుక్ ఎప్పుడంటే

ABN, Publish Date - Apr 11 , 2024 | 08:40 PM

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ లో హీరో కార్తికేయ గుమ్మకొండ ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారు.

kartikeya

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ (UV Creations) అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ (UVConcepts) బ్యానర్ లో హీరో కార్తికేయ గుమ్మకొండ (Kartikeya) ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ (ISWARYA MENON ) హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీడేస్ రాహుల్ టైసన్ (RAAHUL TYSON) ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.


ఇవాళ ఈద్ పండుగ శుభాకాంక్షలు చెబుతూ ఈ సినిమా ప్రీ లుక్ రిలీజ్ చేశారు. రేపు మధ్యాహ్నం 12.06 నిమిషాలకు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.ప్రీ లుక్ ఇన్నోవేటివ్ గా ఉండి ఆకట్టుకుంటోంది. కార్తికేయ నటిస్తున్న 8వ చిత్రమిది. న్యూ కాన్సెప్ట్ బేస్డ్ గా రూపొందుతున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు.

Updated Date - Apr 11 , 2024 | 08:56 PM