Kamal Haasan: క్షణం తీరిక లేకుండా బిజీబిజీ..

ABN , Publish Date - Mar 25 , 2024 | 04:50 PM

విశ్వనాయకుడు కమల్‌ హాసన్‌ n(Kamal Haasan) వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన నటిస్తున్న మూడు సినిమాల అప్‌డేట్‌ ఇచి మూవీ లవర్స్‌లో ఉత్సాహాన్ని పెంచారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘కల్కి’(kalki), ‘థగ్‌ లైఫ్‌’ (thug life) ‘ఇండియన్‌2’ (indian 2)షూటింగ్‌ల గురించి మాట్లాడారు.

Kamal Haasan: క్షణం తీరిక లేకుండా బిజీబిజీ..

విశ్వనాయకుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన నటిస్తున్న మూడు సినిమాల అప్‌డేట్‌ ఇచి మూవీ లవర్స్‌లో ఉత్సాహాన్ని పెంచారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘కల్కి’(kalki), ‘థగ్‌ లైఫ్‌’ (thug life) ‘ఇండియన్‌2’ (indian 2)షూటింగ్‌ల గురించి మాట్లాడారు. "మంచి కథల్ని ప్రేక్షకులకు చెప్పడానికి మేకర్స్‌ ఎప్పుడూ తాపత్రయపడుతుంటారు. ఆలస్యమైనప్పటికీ  క్వాలిటీ విషయంలో రాజీపడడం లేదు. ‘‘ఇండియన్‌2, ‘ఇండియన్‌3’ షూటింగ్‌ పూర్తి చేశాం. ప్రస్తుతం ‘ఇండియన్‌ 2’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. అది అయ్యాక దాని సీక్వెల్‌ పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులు మొదలుపెడతాం. ఎన్నికల హడావిడి అయ్యాక మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ‘థగ్‌ లైఫ్‌’ చిత్రీకరణ షురూ చేస్తాం తెలుగులో. ‘కల్కి 2898 ఏడీ’లో నేను అతిథిగా కనిపిస్తా. నా భాగం షూటింగ్‌ పూర్తయింది’ అని అన్నారు.


అంతే కాదు తాజాగా శ్రుతీహాసన్, దర్శకుడు లోకేష్‌ కనకరాజుపై చిత్రీకరించిన ఆల్బమ్‌కు కమల్‌ పనిచేశారు.  ‘ఇనిమేల్‌’ అంటూ సాగే ఈ పాటకు కమల్‌ లిరిక్స్‌ అందించారు. ద్వారకేశ్‌ ప్రభాకర్‌ దర్శకత్వం వహించిన ఈ పాట సోమవారం విడుదల కానుంది. అలాగే ధనుష్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఇళయరాజా బయోపిక్‌లోనూ కమల్‌ హాసన్‌ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజ జీవిత పాత్రలో తళుక్కున మెరవడమే కాకుండా  స్క్రీన్ ప్లే అందిస్తున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడు అరుణ్‌తో కలిసి స్క్రిప్ట్ను  పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇళయరాజాపై అభిమానంతోనే కమల్‌ ఈ జీవిత కథలో నటించనున్నారని కోలీవుడ్‌ మీడియా చెబుతోంది. 

Updated Date - Mar 25 , 2024 | 05:20 PM