Kalki 2898 AD: విడుదల తేదిపై మరోసారి క్లారిటీ!

ABN , Publish Date - Feb 24 , 2024 | 02:13 PM

పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ (Nag aswin) దర్శకత్వంలో రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ఈ సినిమా తాజా అప్‌డేట్‌ గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Kalki 2898 AD: విడుదల తేదిపై మరోసారి క్లారిటీ!


పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ (Nag aswin) దర్శకత్వంలో రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ఈ సినిమా తాజా అప్‌డేట్‌ గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మే 9న విడుదల అని ప్రకటించినా, వాయిదా పడే అవకాశాలున్నాయంటూ వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. సోషల్‌ మీడియా వేదికగా అప్‌డేట్‌ వదిలింది. ప్రభాస్‌కి సంబంధించిన ఓ వీడియో పోస్ట్‌ చేసి, ‘జస్ట్‌ ది వార్మ్‌ అప్‌’ అనే క్యాప్సన్‌ ఇచ్చారు. ప్రభాస్‌ కాలు కదుపుతు టెరిఫిక్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌తో విడుదల చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అంతే కాదు మే 9న చిత్రం విడుదల కానుందని కూడా తెలిపారు.  దీన్ని బట్టి చిత్రీకరణ శరవేగంగా జరుగుతుందనీ, అనుకున్న సమయానికి సినిమా విడుదల కానుందని అభిమానులు సంబరపడుతున్నారు.



సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా దీపిక పదుకొణె నటిస్తున్నారు. కమల్‌హాసన్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, పశుపతి, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ సంగితం అందిస్తున్నారు.

Updated Date - Feb 24 , 2024 | 02:16 PM