Gunasekhar Euphoria: డైరెక్టర్ గుణ శేఖ‌ర్‌తో.. ’నాటు‘ బైర‌వ‌

ABN , Publish Date - Jun 10 , 2024 | 07:48 PM

గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న యూత్‌ఫుల్ సోష‌ల్ డ్రామా ‘యుఫోరియా’. ఈ చిత్రానికి సంగీత దర్శ‌కుడిగా కాల భైర‌వ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఈ మేర‌కు మూవీ టీమ్ స్పెష‌ల్ వీడియో రిలీజ్ చేసింది.

Gunasekhar Euphoria: డైరెక్టర్ గుణ శేఖ‌ర్‌తో.. ’నాటు‘ బైర‌వ‌
kalabhirava

వైవిధ్యమైన సినిమాలు, భారీ చిత్రాలను తెరకెక్కించే సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్ (Gunasekhar) ద‌ర్శ‌క‌త్వంలో ‘యుఫోరియా’ (Euphoria) అనే యూత్‌ఫుల్ సోషల్ డ్రామా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈచిత్రంలో లేటెస్ట్ మ్యూజిక్ సెన్షేష‌న్ కాల భైర‌వ (Kaala Bhairava) ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగ‌మ‌య్యారు. మ‌న దేశానికి ఆస్కార్ సాధించి పెట్టిన ‘నాటు నాటు..’ పాటను పాడి ఆస్కార్ వేదిక‌ను ఓ ఊపు ఊపిన కాల భైర‌వ‌.. ఓ వైపు సింగ‌ర్‌గా, మ‌రో వైపు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే.


GPtGROTWoAAHImi.jpeg

ఇదిలాఉండ‌గా.. ‘యుఫోరియా’(Euphoria)కు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా కాల‌భైర‌వ టీమ్‌తో జాయిన్ అవుతున్నారంటూ ఓ స్పెష‌ల్ వీడియో ద్వారా అనౌన్స్ చేసింది. గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై నీలిమ గుణ నిర్మాత‌గా ఈ చిత్రం రూపొందనుంది. ఈసినిమాలో న‌టించబోయే న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల‌కు సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని టీమ్ తెలియ‌జేసింది.

Updated Date - Jun 10 , 2024 | 07:48 PM