మిలియ‌న్ల‌లో ఫాలోవ‌ర్స్‌.. కానీ Jr NTR ఫాలో అయ్యే ఆ ఒకే ఒక్క‌డు ఎవ‌రంటే?

ABN , Publish Date - May 20 , 2024 | 05:27 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ జ‌న్మ‌దినం ఈ రోజు. ఈ సంద‌ర్భంగా సామాజిక మాద్య‌మాల్లో ఎన్టీఆర్ అభిమానుల ర‌చ్చ మాములుగా ఉండ‌డం లేదు. ఆకాశ‌మే హ‌ద్దుగా పోస్టులతో, చెల‌రేగి పోతున్నారు. అయితే సోష‌ల్ మీడియాలో ఎన్టీఆర్ ఫాలో అవుతున్న అ ఒక్క‌రు ఎవ‌రా అని అరా తీస్తున్నారు.

మిలియ‌న్ల‌లో ఫాలోవ‌ర్స్‌.. కానీ Jr NTR ఫాలో అయ్యే ఆ ఒకే ఒక్క‌డు ఎవ‌రంటే?
ntr

మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ జ‌న్మ‌దినం ఈ రోజు (మే 20). ఈ సంద‌ర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఆయన అభిమానులు ఈ రోజును పండుగ‌లా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. సామాన్యుల నుంచి, సెల‌బ్రిటీలు, పొలిటీషియ‌న్స్ వ‌ర‌కు అయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఫ్యాన్స్ అయితే సోష‌ల్ మీడియాలో #JrNTR, "Happy Birthday Anna" అనే హ్యాష్‌ట్యాగ్‌ల‌ను ట్రెండింగ్‌లోకి తీసుకువ‌చ్చారు. ర‌క్త‌దానాలు, అన్న‌దానాలు, పండ్ల పంపిణీ వంటి సామాజిక కార్య‌క్ర‌మాలు చేస్తూ త‌మ హీరోపై అభిమానాన్ని చాటుకుంటున్నారు. అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్ వంటి అగ్ర తార‌లు త‌మ సామాజిక మాద్య‌మాల ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు.

ntr

అదేవిధంగా ఎన్టీఆర్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఆయ‌న న‌టిస్తున్న‌, న‌టించ‌బోతున్న చిత్రాల‌ నుంచి మేక‌ర్స్ అప్డేట్స్ విడుద‌ల చేస్తున్నారు. ఈక్ర‌మంలో ముందుగా ఆదివారం దేవ‌నర సినిమా నుంచి ఫియ‌ర్ సాంగ్‌ను రిలీజ్ చేయ‌గా ఈ రోజు(సోమ‌వారం) ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో న‌టిస్తోన్న సినిమా పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇక బాలీవుడ్‌లో ఆరంగేట్రం చేస్తూ న‌టిస్తోన్న వార్‌2 సినిమా నుంచి కూడా ఈ సాయంత్రం ఓ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేయ‌నున్నారు. ఈక్ర‌మంలో సామాజిక మాద్య‌మాల్లో ఎన్టీఆర్ అభిమానుల ర‌చ్చ మాములుగా ఉండ‌డం లేదు. ఆకాశ‌మే హ‌ద్దుగా పోస్టులు, ట్వీట్లు, రీట్వీట్లు, మీమ్స్‌తో చెల‌రేగి పోతున్నారు.


ntr

అయితే.. సోష‌ల్‌మీడియాలో అంత‌గా యాక్టివ్‌గా ఉండ‌ని ఎన్టీఆర్ అడ‌పాద‌డ‌పా మాత్ర‌మే పోస్టులు చేస్తుంటాడు. అయినా ఆయ‌న‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య‌ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. JrNTRను ఇన్‌స్టాగ్రామ్‌లో 7.4 మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 6.3 మిలియ‌న్‌, ట్విట్ట‌ర్‌లో 7.4 మిలియ‌న్ల మంది ఫాలో అవుతుండ‌డం విశేషం. అయితే వీటిలో JrNTR కేవ‌లం ఒక‌రిని మాత్రమే ఫాలో అవుతున్నారు. ట్విట్ట‌ర్‌లో రాజ‌మౌళిని, ఫేస్‌బుక్‌లో త‌మ సినిమా ప్రోడ‌క్ష‌న్ హౌజ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్, రాజ‌మౌళిల‌ను మాత్ర‌మే ఫాలో అవుతుండ‌గా ఇన్‌స్టాలో ఎవ‌రినీ ఫాలో అవ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Updated Date - May 20 , 2024 | 06:20 PM