Jani Master: న్యాయ స్థానంలో న్యాయం ఉంది.. జానీ మాస్టర్
ABN , Publish Date - Dec 26 , 2024 | 03:09 PM
Jani Master: తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీసులు ఫైల్ చేసిన సంచలన ఛార్జ్ షీట్ పై ఆయన స్పందించారు. నిర్దోషిగా బయటికి వస్తానని ధీమా వ్యక్తం చేశారు. మరికొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
బుధవారం జానీ మాస్టర్ కేసులో నార్సింగ్ పోలీసులు సంచలన ఛార్జ్ షీట్ ని సబ్మిట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన ఈవెంట్ ల పేరుతో మహిళలను పలు ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాలు పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. అలాగే లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేదింపులు నిజమే అని పోలీసులు ఫైల్ చేశారు. ఈ ఆరోపణలపై తాజాగా జానీ మాస్టర్ స్పందించారు. \
జానీ మాస్టర్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వీడియో సెల్ఫీ అప్లోడ్ చేశారు. దీంట్లో ఆయన మాట్లాడుతూ.. "నేనేంటో, నేనేం చేశానో నా మనసుకు తెలుసు. అలాగే దేవుడికి కూడా తెలుసు. నేను ఏ తప్పు చేయలేదు. ఈ కేసులో నిర్దోషిగా బయటికొస్తా. న్యాయస్థానాల్లో న్యాయం ఉందని నేను నమ్ముతా.. నేను కక్లీన్ చిట్ తో బయటి రావడం ఖాయం" అంటూ ధీమా వ్యక్తం చేశారు. అలాగే.. నేను ప్రస్తుతం సంతోషంగా ఉన్నాను. మళ్ళీ సినిమాలకి పని చేస్తున్న.నేను నిర్దోషిగా బయటికి వచ్చాకే.. ఎమ్ చెప్పాలనుకుంటున్నానో అదంతా చెప్తా" అని ముగించారు.
కాగా, అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్‌ను కొన్ని రోజుల కింద గోవాలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్ నిమిత్తం చంచల్ గూడ జైలుకు తరలించారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి ఆయన ఇటీవల విడుదల అయ్యారు. 36 రోజులపాటు జానీ జైలులో ఉండగా.. అదే సమయంలో ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డు సైతం క్యాన్సిల్ అయ్యింది. ఇప్పటికే తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై జానీ మాస్టర్ న్యాయపోరాటం చేస్తున్నారు.