Indrani: ఇండియాస్ ఫ‌స్ట్ సూప‌ర్ ఉమెన్ ఫిలిం ‘ఇంద్రాణి’ ట్రైల‌ర్ విడుద‌ల‌

ABN , Publish Date - Jun 02 , 2024 | 05:18 PM

యానీయా, అంకిత, అజయ్ ప్రధాన పాత్రలలో స్టీఫెన్ పల్లం స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందుతున్న ఇండియన్ సూపర్ విమన్ మూవీ ఇంద్రాణి - ఎపిక్ 1: ధరమ్ vs కరమ్. జూన్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు.

Indrani: ఇండియాస్ ఫ‌స్ట్ సూప‌ర్ ఉమెన్ ఫిలిం ‘ఇంద్రాణి’ ట్రైల‌ర్ విడుద‌ల‌
indrani

యానీయా(Yaaneea), అంకిత( Ankita), అజయ్ (Ajay) ప్రధాన పాత్రలలో స్టీఫెన్ పల్లం (Stephen Pallam) స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందుతున్న ఇండియన్ సూపర్ విమన్ మూవీ ఇంద్రాణి - ఎపిక్ 1: ధరమ్ vs కరమ్(Indrani - Epic1: Dharam vs Karam). శ్రేయ్ మోషన్ పిక్చర్స్ (Shray Motion Pictures) బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కేకే రెడ్డి, సుధీర్ వేల్పుల, జే సేన్ సహా నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. జూన్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు.

WhatsApp Image 2024-06-02 at 4.48.38 PM.jpeg

'ఇండియన్ సూపర్ ఫోర్స్' గురించి పవర్ ఫుల్ వాయిస్ ఓవర్, అద్భుతమైన విజువల్స్ తో ప్రజెంట్ చేస్తూ మొదలైన ట్రైలర్ ఆద్యంతం అద్భుతంగా సాగింది. దర్శకుడు స్టీఫెన్ పల్లం ఈ సినిమా కోసం క్రియేట్ చేసిన ఫ్యూచరిస్టిక్ వరల్డ్ విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకున్నాయి. యానీయా, అంకిత, అజయ్, కబీర్ సింగ్ ఇలా మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ సూపర్ పవర్స్ తో అలరించాయి. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ డిజైన్ .. ఇవన్నీ టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తానికి ట్రైలర్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది.

GPENRD2XMAAh74c.jpeg


డైరెక్టర్ స్టీఫెన్ పల్లం (Stephen Pallam) మాట్లాడుతూ..'ఇంద్రాణి' ఒక ఎపిక్ లాంటి సినిమా. చాలా అద్భుతమైన కంటెంట్ ఉంది.. టాప్ క్లాస్ వీఎఫ్ఎక్స్ వర్క్ ప్రేక్షులని అలరిస్తుంది. ఇందులో లీడ్ రోల్ తో పాటు ఒక రోబోని కూడా క్రియేట్ చేశాం. ఆ ఇద్దరి జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో టైం ట్రావెల్ కాన్సెప్ట్ కూడా ఉంది. వందేళ్ళ తర్వాత ఎలాంటి టెక్నాలజీ ఉండబోతుందో ఇందులో చూపించడం జరిగింది. వందేళ్ళ తర్వాత భారతదేశం ప్రపంచంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో ఇందులో సరికొత్తగా చూపించడం జరిగింది. యానీయా ఇండియన్ సూపర్ విమన్ గా అద్భుతంగా నటించింది. ఈ సినిమా తర్వాత ఆమెతో ప్రేమలో పడిపోతారు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే కంప్లీట్ ఎంటర్ టైనర్' అన్నారు.

WhatsApp Image 2024-06-02 at 4.48.37 PM.jpeg

కబీర్ సింగ్ (Kabir Singh) మాట్లాడుతూ.. డైరెక్టర్ స్టీఫెన్ కి హ్యాట్సప్ చెప్పాలి. సినిమాని ఒక విజువల్ వండర్ లా తీర్చిదిద్దారు. ఇండియాలో చాలా సూపర్ హీరో సినిమాలు వచ్చాయి. కానీ ఇంద్రాణి ఫస్ట్ ఇండియన్ సూపర్ విమన్ సినిమా. ఇందులో సూపర్ విలన్ గా చేశాను. ఫ్యామిలీతో కలసి హాయిగా చూసే సినిమా ఇది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి' అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ మాట్లాడుతూ.. ఇంద్రాణి ఓ విజువల్ వండర్. నెక్స్ట్ లెవల్ విజువల్స్ ఉంటాయి. సీజీ వర్క్ అద్భుతంగా ఉంది. సాంగ్స్ చాలా డిఫరెంట్ గా చేశాం. ఫస్ట్ ఇండియన్ సూపర్ విమన్ సినిమాగా వస్తున్న ఇంద్రాణి పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా అన్నారు. కో ప్రొడ్యూసర్ జే సేన్ మాట్లాడుతూ.. అందరికీ థాంక్స్. దర్శకుడు స్టీఫెన్ ఈ సినిమాని చాలా ఫ్యూచరిస్టిక్ గా తీశాడు. ఇలాంటి సూపర్ విమన్ క్యారెక్టర్, విజువైలైజేషన్ ఇండియమ్ స్క్రీన్ కి కొత్తగా ఉంటుందని భావిస్తున్నాను. తప్పకుండా సినిమాను బిగ్ స్క్రీన్ లో చూడండి చాలా ఎంజాయ్ చేశారు.

Updated Date - Jun 02 , 2024 | 05:22 PM