Kalki Vs Indrani: ప్ర‌భాస్ క‌ల్కికి పోటీగా ‘ఇంద్రాణి’.. రెండు ఒకేలా ఉన్నాయేంటి? రోబో కూడా

ABN , Publish Date - Jun 03 , 2024 | 07:02 AM

ప్ర‌భాస్ క‌ల్కి సినిమాకు పోటీగా అచ్చం అలాంటి క‌థ‌క‌థ‌నాల‌తో, క్యారెక్ట‌ర్స్‌తో ఓ చిత్రం సిద్ద‌మైంది. అది కూడా తెలుగులోనే వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే ఇది మ‌న దేశంలోనే ఫ‌స్ట్ టైం సూప‌ర్ ఉమెన్ నేప‌థ్యంలో రూపొందిన చిత్రం అవ‌డం విశేషం.

Kalki Vs Indrani: ప్ర‌భాస్ క‌ల్కికి పోటీగా ‘ఇంద్రాణి’.. రెండు ఒకేలా ఉన్నాయేంటి? రోబో కూడా
kalki vs indrani

రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జలు ఇప్పుడు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది ప్ర‌భాస్ (Prabhas) న‌టించిన క‌ల్కి సినిమా మాత్ర‌మే. మ‌రి కొద్ది రోజుల్లో ఈ సినిమా విడుద‌ల కానున్న‌నేప‌థ్యంలో మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు రెట్టింపు కూడా చేశారు.

kalki

ఈక్ర‌మంలో గ్లిమ్స్‌, టీజ‌ర్‌లు రిలీజ్ చేసి సినిమాపై అంచ‌నాల‌ను పెంచేశారు. తాజాగా చిత్రంలో ఓ ముఖ్య భూమి పోసిస్తున్న బుజ్జి అనే కారుకు సంబంధించి వీడియోను విడుద‌ల చేసి ఆస‌క్తిని మ‌రింత పెంచేశారు. అయితే క‌ల్కి సినిమాకు పోటీగా అచ్చం అలాంటి క‌థ‌క‌థ‌నాల‌తో, క్యారెక్ట‌ర్స్‌తో ఓ చిత్రం సిద్ద‌మైంది. అది కూడా తెలుగులోనే వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.

Indrani

అయితే ఇది మ‌న దేశంలోనే ఫ‌స్ట్ టైం సూప‌ర్ ఉమెన్ నేప‌థ్యంలో రూపొందిన చిత్రం అవ‌డం విశేషం. ఆ సినిమా పేరు ‘ఇంద్రాణి - ఎపిక్ 1: ధరమ్ vs కరమ్’(Indrani - Epic1: Dharam vs Karam). యానీయా (Yaaneea) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోండ‌గా జిల్‌, సుప్రీమ్ సినిమాల్లో విల‌న్‌గా న‌టించిన క‌భీర్ సింగ్ (Kabir Singh) ఈ చిత్రంలో సూప‌ర్ విల‌న్‌గా న‌టిస్తోన్నారు. స్టీఫెన్ పల్లం (Stephen Pallam) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Indrani

తాజాగా విడుద‌ల చేసిన ఈ చిత్రం ట్రైల‌ర్‌ను చూస్తే క‌ల్కి సినిమాతో చాలా సారూప్య‌త‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. క‌ల్కి (Kalki 2898AD)లో బుజ్జి అనే రోబో ఉన్న‌ట్లే ఈ సినిమాలో చిట్టి అనే అదే టైపు, అదే త‌ర‌హా రోబో కూడా ఉండ‌డంతో పాటు 2021 ఏడీ అంటూ సినిమా జ‌రిగే స‌మ‌యాన్ని కూడా చూయించారు. ఇలా సినిమా అసాంతం చాలా ద‌గ్గ‌రి పోలిక‌లు ఉన్నాయి.

kalki.jpg


పైగా ఈ సినిమాను ఫ్యూచరిస్టిక్ వరల్డ్ నేప‌థ్యంలో ఆద్యంతం విజువల్ ఎఫెక్ట్స్ తో తెర‌కెక్కించారు. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ భ‌విష్య‌త్‌లో భార‌త‌దేశం టెక్నాల‌జీ ఏ విధంగా ఉండ‌బోతుందో ఈ సినిమాలో చూపించ‌బోతున్నామ‌ని, ఓ రోబో కూడా ఉంటుంద‌ని, వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ మంచిగా వ‌చ్చింద‌ని అంద‌రినీ అక‌ట్టుకుంటుంద‌న్నారు.

Indrani

ఇదిలాఉండ‌గా ఈ సినిమాను క‌ల్కి సినిమాకు రెండు వారాలు ముందుగానే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తున్నారు. క‌ల్కి (Kalki 2898AD) జూన్ 27న విడుద‌ల కానుండ‌గా ఈ ‘ఇంద్రాణి - ఎపిక్ 1: ధరమ్ vs కరమ్’ (Indrani - Epic1: Dharam vs Karam) చిత్రం జూన్ 14న రిలీజ్ కానుంది.

Indrani

Updated Date - Jun 03 , 2024 | 07:41 AM