SSMB29: మహేష్ కోసం జక్కన్న ఆలోచన మామూలుగా లేదుగా..

ABN , Publish Date - Mar 18 , 2024 | 11:30 AM

టాలీవుడ్‌ దర్శకధీరుడు రాజమౌళి ఆలోచనలు భారీ స్థాయిలో ఉంటాయి. ఆయన సినిమా అంటే రొటీన భిన్నంగా, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో విజువల్‌ ట్రీట్‌లా ఉంటుంది. భారీ కథే కాదు.. కాంబినేషన్ కూడా భారీగా ఉంటుంది.

SSMB29: మహేష్ కోసం జక్కన్న ఆలోచన మామూలుగా లేదుగా..

టాలీవుడ్‌ దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) ఆలోచనలు భారీ స్థాయిలో ఉంటాయి. ఆయన సినిమా అంటే రొటీన భిన్నంగా, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో విజువల్‌ ట్రీట్‌లా ఉంటుంది. భారీ కథే కాదు.. కాంబినేషన్ కూడా భారీగా ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం ఓ అరుదైన కాంబినేషన్‌ తెరపై చూపించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. మహేష్‌ -రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న SSMB29 సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ కూడా భాగం కానున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం.

Hrithik.jpg

ఇప్పటికే ఈ చిత్రంలో వివిధ సినీ రంగాల ప్రముఖులు నటిస్తారని టాక్‌ నడుస్తోంది.  ఈ చిత్రం కోసం ఓ బలమైన ప్రతినాయకుడి పాత్రను సృష్టించారట జక్కన్న. ఆ పాత్రకు ఎవరైతే యాప్ట్‌ అవుతారో అని కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఆలోచనలన్నీ హృతిక్‌ రోషన్‌ దగ్గరకు వచ్చి ఆగాయని టాక్‌. అన్నీ కుదిరితే మహేష్‌ సినిమాలో హృతిక్‌ ప్రతినాయకుడిగా కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా కోసం హైదరాబాద్‌ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ పెద్ద సెట్‌ వేస్తున్నారు. మే నెల నాటికి ఈ సెట్‌ పనులు పూర్తవుతాయి. ఆ తర్వాత షూటింగ్‌ ప్రారంభించే అవకాశం ఉంది. త్వరలోనే హృతిక్‌ రోషన్‌ ఎంట్రీపై నిర్మాణ సంస్థ నుంచి ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. 

Updated Date - Mar 18 , 2024 | 11:32 AM