Horror: ద‌య్యాల మ‌జాకా.. థియేట‌ర్ల‌లోకి లైన్ క‌డుతున్న హ‌ర్ర‌ర్ సినిమాలు

ABN , Publish Date - May 13 , 2024 | 04:09 PM

ప్ర‌స్తుతం అంత‌టా ఓటీటీల ప్రాబ‌ల్యం బాగా పెర‌గ‌డం, ప్ర‌పంచంలోని అన్ని భాష‌ల సినిమాలు, వెబ్ సీరిస్‌లు అన్ని ర‌కాల జాన‌ర్లు సినీ అభిమానుల ముందుకు వ‌చ్చేశాయి. ఈక్ర‌మంలోనే ప్ర‌స్తుతం సౌత్‌లో హ‌ర్ర‌ర్ జాన‌ర్ చిత్రాల హాడావుడి రెట్టింప‌యింది.

Horror: ద‌య్యాల మ‌జాకా.. థియేట‌ర్ల‌లోకి లైన్ క‌డుతున్న హ‌ర్ర‌ర్ సినిమాలు
horror

ప్ర‌స్తుతం అంత‌టా ఓటీటీల ప్రాబ‌ల్యం బాగా పెర‌గ‌డం, ప్ర‌పంచంలోని అన్ని భాష‌ల సినిమాలు, వెబ్ సీరిస్‌లు అన్ని ర‌కాల జాన‌ర్లు సినీ అభిమానుల ముందుకు వ‌చ్చేశాయి. దీంతో వారు సినిమాలు చూసే విధానంలోనూ చెప్ప‌లేనంత‌గా మార్పు వ‌చ్చింది. రోటిన్‌కు భిన్నంగా ఉన్న సినిమాల‌నే జ‌నం ఇష్ట ప‌డుతున్నారు. థియేట‌ర్ల‌లోకి వ‌చ్చే సినిమాలు రెగ్యుల‌ర్‌గా ఉంద‌ని తెలిస్తే చాలు అలాంటి చిత్రాల‌ను ప‌ట్టించుకోవ‌డ‌మే ప‌బ్లిక్ బంద్ చేశారు.

Baak.jpg

దీంతో సినిమా మేక‌ర్స్ కూడా త‌మ‌స్టైల్‌ను మార్చుకుని క్ర‌మంగా ప్రేక్ష‌కుల నాడిని ప‌ట్టుకుంటూ సినిమాలు రూపొందించ‌డానికి శ్ర‌ద్ధ చూపుతున్నారు. ఈక్ర‌మంలోనే ప్ర‌స్తుతం సౌత్‌లో హ‌ర్ర‌ర్ జాన‌ర్ చిత్రాల హాడావుడి రెట్టింప‌యింది. ప్రేక్ష‌కుల టేస్ట్‌కు త‌గ్గ‌ట్టు సినిమాలు రూపొందిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఈ సంవ‌త్స‌రం ఇప్ప‌టికే డ‌జ‌న్‌కు పైగానే సినిమాలు,వెబ్ సిరీస్‌లు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయంటే ప్రేక్ష‌కుల అభిరుచి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

kishor.jpg


ఈ యేడాది ఇప్ప‌టికే భ్ర‌మ‌యుగం, భూత‌ద్దం భాస్క‌ర నారాయ‌ణ‌, తంత్ర‌, వ‌ళ‌రి, గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది, ఓం భూం భుష్‌, సైథాన్‌, బాక్‌, ఊరు పేరు భైర‌వ కోన‌, 105 మినిట్స్‌, ఇంటి నెం 13, టెరోట్ వంటి సినిమాలు డ‌జ‌న్‌కు పైగా థియేట‌ర్ల‌లో విడుద‌లై ప్రేక్ష‌కాధ‌ర‌ణ పొంద‌గా ఇన్‌స్పెక్ట‌ర్ రిషి వంటి అర డ‌జ‌న్ వ‌ర‌కు వెబ్ సిరీస్‌లు ఓటీటీలో విడుద‌ల‌య్యాయి.

creepy-first-look-of-sabdham_b_1412230513.jpg

అయితే తాజాగా థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఆర్‌ణ్మై (బాక్‌) చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో పాటు ఈ యేడు త‌మిళ నాట రూ. 60 కోట్ల క‌లెక్ష‌న్లు రాబ‌ట్టి రికార్డు సృష్టించ‌డంతో స‌ర్వ‌త్రా అంద‌రి దృష్టి ఇప్పుడ త్వ‌ర‌లో విడుద‌ల కానున్న చిత్రాల‌పై ప‌డింది. ఇదిలాఉండ‌గా రానున్న నెల‌ల్లో ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేసేందుకు ల‌వ్ మీ (LoveMe) , భ‌వ‌న‌మ్, ఓ మంచి గోష్ట్ (O Manchi Ghost), శ‌బ్ధం, డెమోంటే కాలనీ (Demonte Colony 2) వంటి మ‌రో అర డ‌జ‌న్ వ‌ర‌కు హ‌ర్ర‌ర్ చిత్రాలు సిద్ధ‌మ‌య్యాయి. అయితే తాజాగా ఎన్నిక‌ల హ‌డావుడి ముగియ‌డం, వేస‌వి సెల‌వుల నేప‌థ్యంలో క‌లెక్ష‌న్లు సునామీ కురుస్తుంద‌ని మేక‌ర్స్ బావిస్తున్నారు. చూడాలి హ‌ర్ర‌ర్ చిత్రాలు ఎంత‌మేర విజ‌యం సాధిస్తాయో.

Updated Date - May 13 , 2024 | 04:09 PM