Kalki 2898AD Vs A Quiet Place: మీకు తెలుసా.. క‌ల్కికి పోటీగా థియేట‌ర్ల‌లోకి భారీ హాలీవుడ్ చిత్రం

ABN , Publish Date - Jun 26 , 2024 | 01:50 PM

ప్ర‌స్తుతం మ‌న దేశ‌మంతా ఎంత‌గానో ఎదురు చేస్తున్న చిత్ర‌మేదైనా ఉంది అంటే అది ప్ర‌భాస్ క‌ల్కి సినిమా మాత్ర‌మే. అయితే ఈ సినిమాకు పోటీగా ఓ భారీ హాలీవుడ్ థ్రిల్ల‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

Kalki 2898AD Vs A Quiet Place: మీకు తెలుసా.. క‌ల్కికి పోటీగా థియేట‌ర్ల‌లోకి భారీ హాలీవుడ్ చిత్రం
kalki Prabhas,

రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు మ‌న దేశ‌మంతా ఎంత‌గానో ఎదురు చేస్తున్న చిత్ర‌మేదైనా ఉంది అంటే అది ప్ర‌భాస్ (Prabhas) న‌టించిన క‌ల్కి (Kalki 2898AD) సినిమా మాత్ర‌మే. ప్ర‌మోష‌న్ కంటెంట్‌తో చిత్ర‌బృందం ఆ అంచ‌నాల్ని ఎప్ప‌టిక‌ప్పుడు రెట్టింపు చేస్తోంది. అంత‌లా సినీ ల‌వ‌ర్స్‌, ప్ర‌భాస్ అభిమానులు ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చూస్తున్నారు. ఇప్ప‌టికే అన్ని ప్ర‌దేశాల‌లో ముంద‌స్తు బుకింగ్స్ సైతం ప్రారంభ‌మై మూవీ రిలీజ్‌కు ముందే మ‌న దేశంలో రికార్డులు సృష్టిస్తోంది.

Kalki.jpg

ఇదిలాఉండ‌గా చాలా రోజుల త‌ర్వాత క‌ల్కి (Kalki 2898AD) రూపంలో ఓ భారీ చిత్రం థియేట‌ర్ల‌కు వ‌స్తుండ‌డంతో టాలీవుడ్‌, బాలీవుడ్‌, త‌మిళ నాడుల్లో చిన్న, మీడియం రేంజ్ సినిమాల‌న్నీ త‌మ రిలీజ్‌ల‌ను వాయిదా వేసుకున్నాయి. దీంతో మ‌ల‌యాళం మిన‌హా ప్ర‌పంచ‌ వ్యాప్తంగా 10 వేల‌కు పైగా స్క్రీన్ల‌లో క‌ల్కి సినిమా విడుద‌ల కానుంది. దీంతో సినిమా మొద‌టి వారంలోనే లాభాల్లోకి వెళుతుంద‌ని అంతా అంచ‌నా వేస్తున్నారు. కాగా ప్ర‌భాస్ (Prabhas) మూవీకి పోటీగా మ‌న దేశంలో సినిమాలు పెద్ద‌గా రిలీజ్ అవ్వ‌కున్నా ప్ర‌తీ సారి ఓ భారీ హాలీవుడ్ చిత్రంతో పోటీ మాత్రం త‌ప్ప‌డం లేదు.

A Quiet Place


ఇప్పుడు తాజాగా క‌ల్కి (Kalki 2898AD) సినిమా విడుద‌ల తెల్లారే ప్ర‌పంచ‌మంతా ఈగ‌ర్లీగా వెయిట్ చేస్తున్న ఓ భారీ హాలీవుడ్ థ్రిల్ల‌ర్ ఏ క్వైట్ ప్లేస్ డే వ‌న్ (A Quiet Place: Day One) అనే అపోకలిప్టిక్, సైన్స్‌ఫిక్ష‌న్‌, హారర్ సినిమా జూన్ 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. గ‌తంలో వ‌చ్చిన ఈ సినిమా సీక్వెల్స్ ఒక‌దాన్ని మించి ఒకటి క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించ‌గా రాబోతున్న సినిమాపై అంచ‌నాలు అంత‌కుమించి అనే రేంజ్‌లోనే ఉండ‌డం గ‌మ‌నార్హం.

A Quiet Place

దీంతో ఈ సినిమా విడుద‌ల‌ క‌ల్కి (Kalki 2898AD) సినిమా క‌లెక్ష‌న్లకు ఏమైనా అడ్డంకి అవుతుందా అని ప‌లువురు అంచ‌నాలు వేస్తున్నారు. మ‌న దేశంలో వ‌సూళ్ల ప‌రంగా ఎలాంటి అడ్డంకి లేకున్నా ఓవ‌ర్సీస్ క‌లెక్ష‌న్ల‌పై ప్ర‌భావం ఉంటుందేమోన‌ని అనుకుంటున్నారు. గ‌త సంవ‌త్స‌రం ఇలానే ప్ర‌భాస్ న‌టించిన స‌లార్ విడుద‌ల మ‌రుస‌టి రోజే అన్ని దేశాల‌లో అక్వామెన్ ది లాస్ట్ కింగ్‌డ‌మ్ (Aquaman and the Lost Kingdom) అనే సినిమా విడుద‌లై మంచి విజ‌యం ద‌క్కించుకోవ‌డం విశేషం.

Updated Date - Jun 26 , 2024 | 07:49 PM