Sundaram Master: ఫిబ్రవరి 23న హర్ష చెముడు.. ‘సుందరం మాస్టర్’ రిలీజ్

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:58 AM

హీరో రవితేజ ఆర్ టీ టీం వర్క్స్‌, గోల్డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం 'సుందరం మాస్టర్’ హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. ఈరోజు విడుదల తేదీని ప్రకటించారు.

Sundaram Master: ఫిబ్రవరి 23న హర్ష చెముడు.. ‘సుందరం మాస్టర్’ రిలీజ్
SUNDERAM MASTER

హీరో రవితేజ (RaviTeja)కు చెందిన ఆర్ టీ టీం వర్క్స్మరియు గోల్డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం 'సుందరం మాస్టర్’ (Sundaram Master). ఈ చిత్రంలో హర్ష చెముడు (Harsha Chemudu), దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. ఆల్రెడీ ఇది వరకు వదిలిన కంటెంట్ అందరిలోనూ ఆసక్తి కలింగించిన సంగతి తెలిసిందే.

ఒక గ్రామంలో కష్టపడే ఉపాధ్యాయుడి చుట్టూ సుందరం మాస్టర్ (Sundaram Master) కథ తిరుగుతుంది. మిర్యాల మెట్ట అనే మారుమూల గ్రామంలో ఇంగ్లీషు టీచర్‌గా సుందరం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని వయసుల వారు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి విద్యార్థులుగా నమోదు చేసుకుంటారు. సుందరం మాస్టర్ వాళ్ళందరికీ భాషని ఎలా బోధిస్తారనే దాన్ని వినోదాత్మక చిత్రంగా రూపొందించారు.


తాజాగా ఈ రోజు 'సుందరం మాస్టర్ (Sundaram Master) విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్ ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదల కానుంది. ఫిబ్రవరి 23న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుందని ప్రకటించారు.

అయితే ఇప్పటికే ఈ కామెడీ డ్రామాని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతకుముదే వచ్చిన టీజర్ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోగా హర్ష చెముడు నవ్వించాడు. కొత్త దర్శకుడు కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించగా, మాస్ మహారాజ్ రవితేజ (RaviTeja) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడంతో ఈ చిత్రానికి మంచి బజ్ ఏర్పడింది. దీపక్ ఎరెగడ సినిమాటోగ్రఫీ అందించగా, శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూర్చారు.

Updated Date - Feb 01 , 2024 | 11:58 AM