Harika Narayan: ప్రియుడితో పెళ్లి పీటలెక్కనున్న గ్లామరస్ సింగర్
ABN , Publish Date - Mar 07 , 2024 | 05:23 PM
టాలీవుడ్ సింగర్ హారికా నారాయణ్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన స్నేహితుడు పృధ్వీనాథ్ వెంపటితో కలిసి ఏడు అడుగులు వేయనున్నట్లు, ఇటీవల నిశ్చితార్థం జరిగినట్లు ఇన్‌స్ట్టాగ్రామ్ ద్వారా ఆమె తెలిపారు.
టాలీవుడ్ సింగర్ హారికా నారాయణ్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన స్నేహితుడు పృధ్వీనాథ్ వెంపటితో కలిసి ఏడు అడుగులు వేయనున్నట్లు, ఇటీవల నిశ్చితార్థం జరిగినట్లు ఇన్‌స్ట్టాగ్రామ్ ద్వారా ఆమె తెలిపారు. వారిద్దరి మధ్య ఏడేళ్లగా ఉన్న స్నేహం ప్రేమగా మారిందని ఇన్ స్టా పోస్ట్ ద్వారా తెలిపింది. ‘‘ఏడేళ్లగా ఉన్న అద్భుతమైన స్నేహాన్ని ప్రేమగా మార్చుకున్నాం. ఈ అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి మా మధ్య ఉన్న అనుబంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్తున్నాం. కొత్త అనుబంధాన్ని మరింత కొత్తగా మొదలుపెడదాం’’ అంటూ నిశ్చితార్థం ఫోటోస్ షేర్ చేసింది హారికా నారాయణ్. ఉంగరం మార్చుకుంటున్న ఫొటోను షేర్ చేశారు. అయితే కాబోయే భర్త గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
తూర్పు గోదావారి జిల్లా రాజోలులో జన్మించిన హారిక.. ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ కుటుంబానికి దగ్గర బంధువు. ఆమె తండ్రి ఎయిర్‌ఫోర్స్‌లో బాధ్యతలు నిర్వహిస్తుండడంతో ఉత్తరాదిలో పెరిగారు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి జర్మనీ వెళ్లాలని కలలు కన్నారు. అయితే సంగీతం మీదున్న ఆసక్తితో ఆమె గాయని గా మారారు. తన గాత్రంతో సంగీత ప్రియులను అలరిస్తున్నారు. నిహారిక కథానాయికగా నటించిన ‘సూర్యకాంతం’తో ప్లేబ్యాక్ సింగర్‌గా మారారు. ఆ తర్వాత ‘నా తప్పు ఏమున్నదబ్బా (బ్లాక్ రోజ్)’ సాంగ్‌తో యువతకు కనెక్ట్ అయ్యారు. హాస్కీ వాయిస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 90 సెకన్లలో తొమ్మిది మంది ఇంటర్నేషనల్ సింగర్స్‌ని అనుకరిస్తూ ఆమె చేసిన ఆల్బమ్ ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆకర్షించింది. సర్కారువారి పాట చిత్రంలో టైటిల్ రాప్ పాడిన వారిలో ఆమె కూడా ఒకరు. దాంతోపాటు రావణాసుర చిత్రంలోని అంథెమ్‌కు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు మహేశ్‌బాబు విపరీతమైన అభిమానం. ఆయన్ను దగ్గర నుంచి చూడొచ్చనే ‘బ్రహ్మోత్సవం’లో నటించినట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అంతే కాదు విజయ్ హీరోగా నటించిన వారసుడు సినిమాలోని ‘తలపతి’పాటతో ఆమె మరింత ఫేమస్ అయ్యారు.