Hanuman Producer: సంక్రాంతికి వచ్చి వెళ్లిపోయే సినిమా కాదు.. నిలబడే సినిమా! 

ABN , Publish Date - Jan 05 , 2024 | 01:49 PM

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'హనుమాన్ ’. ఎలాంటి అంచనాలు లేకుండా తెరకెక్కిన ఈ చిత్రం ఒక టీజర్‌, ట్రైలర్‌తో అందరి దృష్టినీ తమ వైపు తిప్పుకొంది. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలతో పోటీ పడుతోంది. అయితే మూడు పెద్ద సినిమా మధ్య నలిగిపోయే పరిస్థితి ఉంది. ఆశించిన సంఖ్యలో థియేటర్లు దక్కే అవకాశం కనిపించడం లేదు.

Hanuman Producer: సంక్రాంతికి వచ్చి వెళ్లిపోయే సినిమా కాదు.. నిలబడే సినిమా! 

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'హనుమాన్ ’. ఎలాంటి అంచనాలు లేకుండా తెరకెక్కిన ఈ చిత్రం ఒక టీజర్‌, ట్రైలర్‌తో అందరి దృష్టినీ తమ వైపు తిప్పుకొంది. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలతో పోటీ పడుతోంది. అయితే మూడు పెద్ద సినిమా మధ్య నలిగిపోయే పరిస్థితి ఉంది. ఆశించిన సంఖ్యలో థియేటర్లు దక్కే అవకాశం కనిపించడం లేదు. ఈ నెల 12న విడుదల అవుతున్న ‘గుంటూరు కారం’ దాదాపు 90 శాతం థియేటర్లను ఆక్యుపై చేసింది. కొన్ని ఏరియాల్లో ‘హనుమాన్‌’కి కనీసం ఒకట్రెండు థియేటర్లు కూడా దొరక్కపోవడం చూస్తుంటే ఈ సినిమాని టార్గెట్‌ చేశారని నెటిజన్లు భావిస్తున్నారు. వీఎఫ్‌ఎక్స్‌ పనులు తదితర కారణాల వల్ల గత ఏడాది రెండుమూడు సార్లు వాయిదా పడిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. కంటెంట్‌ మీదున్న నమ్మకం బాలీవుడ్‌లో మార్కెట్‌, అక్కడ దక్కిన థియేటర్లను దృష్టిలో పెట్టుకుని సంక్రాంతి బరి నుంచి వెనకడుగు వేయడం లేదు చిత్ర దర్శకనిర్మాతలు. అయితే ఇప్పటి దాకా తమకు జరుగుతున్న అన్యాయంపై మౌనంగా ఉన్న టీమ్‌ ఇప్పుడిప్పుడే నోరు విప్పుతోంది.

Neeranjan.jpg

తాజాగా నిర్మాత నిరంజన్‌ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తమ సినిమాని కావాలని తొక్కేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో 75 సింగిల్‌ స్ర్కీన్లు ఉంటే కనీసం 10 కూడా హనుమాన చిత్రానికి కేటాయించలేదని నిరంజన చెబుతున్నారు. "ఉన్న థియేటర్లన్నీ ఒక సినిమా కోసం వార్‌ వన్‌ సైడ్‌ చేయడం అన్యాయమే. ‘గుంటూరు కారం’ చిత్రాన్ని నైజాంలో దిల్‌రాజు పంపిణీ చేస్తున్నారు. అన్ని థియేటర్లలోనూ తన సినిమానే పడాలన్నది పంపిణీదారుడిగా ఆయన ఆలోచన. మా చిత్రానికి కూడా కొన్ని థియేటర్లు సర్దితే బాగుండేది. రెండు మూడు రోజుల్లో ఈ పరిస్థితి సర్దుబాటు అవుతుందన్న ఆశ ఉంది. అంతగా కాకపోతే సినిమా విడుదలయ్యాక థియేటర్లు వాటంతట అవే పెరుగుతాయన్న నమ్మకం ఉంది ’’ అని అన్నారు. 'హనుమాన్ ’ సంక్రాంతికి వచ్చి వెళ్లిపోయే సినిమా కాదని, కనీసం నాలుగైదు వారాలు బాక్సాఫీసు దగ్గర సినిమా ఉంటుందని, అందుకే సంక్రాంతికి పెద్దగా వసూళ్లు రాకపోయినా, ఇబ్బంది లేదని చెబుతున్నారు నిర్మాత. 


Updated Date - Jan 05 , 2024 | 01:50 PM