Prabhas New Update: ప్రభాస్‌తో హను సినిమా... అంతా సిద్ధం!

ABN , Publish Date - Apr 09 , 2024 | 10:29 AM

'అందాల రాక్షసి’, కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రాలతో ఆకట్టుకున్నారు హను రాఘవపూడి(Hanu Raghavapudi). ఆ తర్వాత రెండు చిత్రాలు అంతంత మాత్రంగానే ఆడాయి. ఐదో చిత్రం ‘సీతారామం’తో (Sitaramam) తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.

Prabhas New Update: ప్రభాస్‌తో హను సినిమా... అంతా సిద్ధం!
Prabhas

'అందాల రాక్షసి’, కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రాలతో ఆకట్టుకున్నారు హను రాఘవపూడి(Hanu Raghavapudi). ఆ తర్వాత రెండు చిత్రాలు అంతంత మాత్రంగానే ఆడాయి. ఐదో చిత్రం ‘సీతారామం’తో (Sitaramam) తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పుడాయన పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌(Prabhas)తో ఓ చిత్రం తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఓ వేడుకలో ఆయన ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. "ఇది చారిత్రక అంశాలతో నిండిన ఫిక్షనల్‌ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఉంటుంది. ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు విశాల్‌ చంద్రశేఖర్‌ ఇప్పటికే మూడు పాటల్ని సిద్థం చేశారు.  ప్రస్తుతం ఈ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అని తెలిపారు. ఈ చిత్రాన్ని పాన్  ఇండియా స్థాయిలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుంది.

ప్రస్తుతం ప్రభాస్‌ ‘కల్కి 2898ఎ.డి’ చిత్రంతో బిజీగా ఉన్నారు. నాగ్‌ అశ్విన్  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఆయన నటిస్తోన్న ‘రాజాసాబ్‌’ చిత్రీకరణ దశలో ఉంది. వీటితో పాటు ‘సలార్‌ 2’, ‘స్పిరిట్‌’ సినిమాలు లైన్ లో ఉన్నాయి.

HBD Allu Arjun: అల్లు టు మల్లూ- స్టైలిష్‌ టు ఐకాన్ స్టార్.. బన్నీ జర్నీ ఇది!



Updated Date - Apr 09 , 2024 | 10:45 AM