Guntur Kaaram: పాటలే రికార్డ్‌ అనుకుంటే.. మళ్లీ ఇంకోటి! 

ABN , Publish Date - Jan 06 , 2024 | 01:54 PM

అతడు, ఖలేజా చిత్రాల తర్వాత త్రివిక్రమ్‌-మహేశ్‌ బాబు కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్  నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రంలో లిరికల్‌ సాంగ్స్‌ లక్షల వ్యూస్‌తో యూట్యూబ్‌ను షేక్  చేస్తున్నాయి. ఇప్పుడు సినిమా ప్రీమియర్‌ షో విషయంలోను  రికార్డు సృష్టించింది

Guntur Kaaram: పాటలే రికార్డ్‌ అనుకుంటే.. మళ్లీ ఇంకోటి! 

అతడు, ఖలేజా చిత్రాల తర్వాత త్రివిక్రమ్‌(Trivikram)-మహేశ్‌ బాబు (Maheshbabu)కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur kaaram). హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్  నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రంలో లిరికల్‌ సాంగ్స్‌ లక్షల వ్యూస్‌తో యూట్యూబ్‌ను షేక్  చేస్తున్నాయి. ఇప్పుడు సినిమా ప్రీమియర్‌ షో విషయంలోను  రికార్డు సృష్టించింది. ‘గుంటూరు కారం’ కోసం జనవరి 11న అమెరికాలో 5,408 ప్రీమియర్‌ షోలు వేయనున్నారు. తెలుగు సినిమాకు ఇన్ని షోలు వేయడం రికార్డని  చిత్ర బృందం తెలిపింది. 

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ సినిమాపై మరోసారి ధీమా వ్యక్తం చేశారు. సినిమా అద్భుతంగా వచ్చిందనీ, తమన సంగీతం, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని చెప్పారు. అయితే ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక శనివారం హైదరాబాద్‌లో జరగాల్సి ఉంది. కానీ సెక్యూరిటీ, పోలీసు అనుమతులు ఇతర కారణాలతో ఈవెంట్‌ వాయిదా పడింది. ఈ విషయంలో మాత్రం అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో కథానాయికలు


Updated Date - Jan 06 , 2024 | 03:05 PM