Guntur Kaaram: ఇంకా ఆలస్యం.. ‘గుంటూరు కారం’ ట్రైలర్ వచ్చేది ఎన్ని గంటలకంటే..

ABN , Publish Date - Jan 07 , 2024 | 07:19 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) ట్రైలర్ రావడానికి ఇంకాస్త సమయం పడుతుంది. తాజాగా నిర్మాత నాగవంశీ.. ట్రైలర్ విడుదల సమయాన్ని అధికారికంగా ప్రకటించారు.

Guntur Kaaram: ఇంకా ఆలస్యం.. ‘గుంటూరు కారం’ ట్రైలర్ వచ్చేది ఎన్ని గంటలకంటే..
Mahesh Babu in Guntur Kaaram

సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) ట్రైలర్ రావడానికి ఇంకాస్త సమయం పడుతుంది. రాత్రి 8 గంటలకు ట్రైలర్ వస్తుందని ఇప్పటి వరకు వార్తలు వినిపించాయి కానీ.. తాజాగా మేకర్స్ అధికారికంగా ట్రైలర్ విడుదల టైమ్‌ని ప్రకటించారు. వారు చెప్పిన దాని ప్రకారం ట్రైలర్ రావడానికి ఇంకాస్త సమయం పట్టనుంది. అందుకు గల కారణాలు కూడా మేకర్స్ తెలియజేశారండోయ్.. (#GunturKaaramTrailerExplosion)

ఇంతకీ మేకర్స్ చెప్పిన ట్రైలర్ టైమ్ ఎంతంటే.. ఈరోజు (ఆదివారం) రాత్రి 9 గంటల 9 నిమిషాలకు ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. ఈ ఆలస్యానికి కారణం ఓవర్సీస్ కంటెంట్ మరియు ట్రైలర్ వర్క్ సమాంతరంగా జరుగుతుందని, ఈ విషయాన్ని దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లుగా నిర్మాత నాగవంశీ ట్విట్టర్ ఎక్స్ వేదికగా తెలియజేశారు. అన్ని రెడీ చేసి 9 గంటల 9 నిమిషాలకు దింపుతామని ఆయన ప్రకటించారు. దీనికి ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Guntur Kaaram: ‘కీర్తికిరీటాలు’ నవలతో ‘గుంటూరు కారం’ పోలిక.. నాగవంశీ రియాక్షన్ ఇదే..

*************************

*కెప్టెన్‌ నివాసానికి క్యూకడుతున్న సినీ ప్రముఖులు.. ఇప్పుడెందుకు వస్తున్నారంటూ..?

*************************

*Anjali: ముద్దుగా కనిపించినా.. నా పనులు అలా ఉంటాయి

***********************

*Director Vijay Binni: ‘నా సామిరంగ’లో చాలా సర్‌ప్రైజ్‌లున్నాయ్..

**************************

Updated Date - Jan 07 , 2024 | 07:19 PM