Shanmukh Jaswanth: షణ్ముఖ్‌ సోదరుడి కేసు.. వెలుగులోకి మరిన్ని మోసాలు.. గీతూ గట్టిగా ఇచ్చేసింది!

ABN , Publish Date - Feb 24 , 2024 | 07:48 PM

తనను మోసం చేశాడంటూ సంపత్ వినయ్‌పై అతని ప్రియురాలు మౌనిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంపత్ ను అరెస్ట్‌ చేయడానికి వెళ్లిన పోలీసులకు యూట్యూబర్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌ దొరికిపోయాడు. పోలీసులు వెళ్లిన సమయానికి అతను గంజాయి సేవిస్తూ కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే

Shanmukh Jaswanth: షణ్ముఖ్‌ సోదరుడి కేసు.. వెలుగులోకి మరిన్ని మోసాలు.. గీతూ గట్టిగా ఇచ్చేసింది!


తనను మోసం చేశాడంటూ సంపత్  వినయ్‌పై (Sampath vinay) అతని ప్రియురాలు మౌనిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు  సంపత్ ను అరెస్ట్‌ చేయడానికి వెళ్లిన పోలీసులకు యూట్యూబర్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌ (Shanmukh jaswanth) దొరికిపోయాడు. పోలీసులు వెళ్లిన సమయానికి అతను గంజాయి సేవిస్తూ కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక  సంపత్‌ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని డాక్టర్‌ మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. దీనిపై బిగ్‌బాస్‌ ఫేం గీతూ రాయల్‌ (Geethu Royal) యూట్యూబ్‌ వేదికగా స్పందించింది.


‘నేను, షణ్ముఖ్‌ ఒకప్పుడు బాగానే మాట్లాడుకునేవాళ్లం. కానీ అతడు బిగ్‌బాస్‌ షోలో ఉన్నప్పుడు నేనిచ్చిన రివ్యూల వల్ల అతడి కుటుంబానికి నాకు మధ్య గ్యాప్‌ వచ్చింది. అతని అన్నయ్య సంపత్‌ వినయ్‌ ప్రేయసి మౌనిక నాకు మంచి ఫ్రెండ్‌. తను నా ఫీమేల్‌ క్రష్‌ కూడా! మౌనిక, సంపత్‌ చాలా ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నారు. వీరికి 2021లోనే రోకా జరిగింది. ఏడాది తిరిగేలోగా పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పింది. కానీ అంతలోనే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి పెళ్లికి గ్యాప్‌ తీసుకున్నారు. అంతా సద్దుమణిగాక గతేడాది నవంబర్‌లో పసుపు దంచారు. పెళ్లి పనులు మొదలు పెట్టేశారు. పెళ్లికి  కళ్యాణమండపం కూడా బుక్‌ చేశారు. ఈ నెల 28న పెళ్లి జరగాల్సి ఉంది. వారం రోజుల్లో పెళ్లి ఉందనగా సంపత్‌ వేరే అమ్మాయిని వివాహం చేసుకోవాలని అనుకున్నాడట! ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకో అమ్మాయితో లైఫ్‌ పంచుకోవాలనుకోవడం నాకేౖతే నచ్చలేదు. ఇలాంటి సందర్భాన్ని ఏ అమ్మాయి తట్టుకోలేదు. అందుకనే తను పోలీస్‌ కేసు పెట్టింది. పైగా ఆమె అతడిని కలవడానికి ఇంటికి వెళ్తే లోపలికి రానివ్వకపోవడం కరెక్ట్‌ కాదు. వ్యత్తి రీత్యా డాక్టర్‌ అయినా మౌనిక చాలా సెన్సిటివ్‌. ఆ మధ్యన డిప్రెషన్‌లోకి కూడా వెళ్లింది’ అని గీతూ తెలిపింది. ప్రస్తుతం షణ్ను బెయిల్‌పై బయటికొచ్చాడని తెలిసింది.


ఇదిలా ఉండగా ఈ కేసులో అనుహ్యంగా మరికొన్ని నిజాలు బయటకు వస్తున్నాయి. చాలామంది అమ్మాయిలు షన్ను సోదరుడి వల్ల మోసపోయినట్టు సమాచారం. ఈ కేసుతో సంపత్‌ వల్ల మోసపోయిన బాధితులు మరికొందరు బయటకొస్తున్నారు. సంపత్‌.. తన ఎంబీఏ క్లాస్‌మేట్‌ అయిన ఓ యువతి దగ్గర 2016లో థిక్‌ షేక్‌ ఫ్రాంచైజీలో పెట్టుబడి పెడదామని చెప్పి రూ.20 లక్షలు తీసుకున్నాడట. నెలకు రూ.7 వేలు లాభం మాత్రమే చూపించాడట. దీంతో మొత్తం డబ్బులు తిరిగివ్వాలని  సదరు యువతి అడగ్గా.. సంపత్‌ ఈమెని బ్లాక్‌ చేశాడట. తాజాగా మౌనికతో నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి ఆరు రోజు ఉందనగా ముంబయిలో మరో యువతిని ఇప్పటికే సంపత్‌ పెళ్లి చేసుకున్నాడట. ఇలాంటి చాలామంది ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారని సన్నిహితుల నుంచి సమాచారం. 

Updated Date - Feb 24 , 2024 | 07:49 PM