Anjali@50: భయపెట్టడానికి మళ్ళీ  రెడీ!

ABN , Publish Date - Jan 01 , 2024 | 01:47 PM

అంజలి (Anjali) టైటిల్ పాత్రలో నటిస్తోన్న హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ (Geethanjali malli vachindi). మలయాళ నటుడు రాహుల్ మాధవ్ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ  నిర్మిస్తున్నారు.

Anjali@50: భయపెట్టడానికి మళ్ళీ  రెడీ!


అంజలి (Anjali) టైటిల్ పాత్రలో నటిస్తోన్న హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ (Geethanjali malli vachindi). మలయాళ నటుడు రాహుల్ మాధవ్ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ  నిర్మిస్తున్నారు. అంజ‌లి న‌టిస్తోన్న‌ 50వ సినిమా ఇది. హారర్ కామెడీ జోనర్ లో ట్రెండ్ సెట్ చేసిన గీతాంజలి సినిమాకు సీక్వెల్ ఇది. షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది. కొత్త ఏడాది 2024 ప్రారంభం సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ మేకర్స్ ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. పాడుబడ్డ భవంతిలో నాట్య కళాకారిణి లుక్‌లో అంజలి కనిపిస్తోంది. ఓ వైపు అంజలి లుక్.. మరో వైపు భవంతి బ్యాక్ డ్రాప్ చూస్తుంటే సరికొత్త కథ, కథనంతో ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ఈ ఏడాది ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమైందని తెలుస్తోంది.

Anjali-Solo-Still.jpg

భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ‘గీతాంజ‌లి మ‌ళ్ళీ వ‌చ్చింది’ చిత్రాన్ని  మేక‌ర్స్ తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. ‘గీతాంజలి’ సినిమా ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే సీక్వెల్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్‌లతో పాటు ఈ సీక్వెల్‌లో స‌త్య‌, సునీల్‌, ర‌విశంక‌ర్‌, శ్రీకాంత్ అయ్యంగార్ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.  ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన హార‌ర్ కామెడీ చిత్రాల‌న్నీ ఒక ఎత్తైతే ‘గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది’లో హార‌ర్ కామెడీ వాట‌న్నింటినీ మించేలా ఉంటుంది.  

Updated Date - Jan 01 , 2024 | 01:47 PM