Game Changer: రాజమండ్రికి రామ్‌చరణ్‌..

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:04 PM

రామ్‌చరణ్‌ (Ram charan) హీరోగా శంకర్‌ (Shankar) దర్శకత్వంలో 'గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే!

Game Changer: రాజమండ్రికి రామ్‌చరణ్‌..
Ram charan, Kiara adwani

రామ్‌చరణ్‌ (Ram charan) హీరోగా శంకర్‌ (Shankar) దర్శకత్వంలో 'గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! పొలిటికల్‌ యాక్షన్  ఎంటర్టైనర్‌గా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. ఈ సినిమాకు సంబంధించి తాజా అప్‌డేట్‌ వచ్చింది. ఈ నెల మూడో వారం నుంచి రాజమండ్రిలో కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానుందని చిత్ర వర్గాల నుంచి సమాచారం. కొద్దిరోజులు అక్కడ చిత్రీకరణ చేసుకున్నాక విశాఖపట్టణంలోనూ కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

HBD Allu Arjun: టీజర్‌ మాత్రమే కాదు.. టీవీల్లో ఎంటర్‌టైనమెంట్‌కు కొదవలేదు..


ఈ షెడ్యూల్‌ దాదాపు పది రోజులకు పైగా ఉండనున్నట్లు సమాచారం. ఇందులో చరణ్‌ రెండు కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు. మరోవైపు శంకర్‌ ఇండియన -2 చిత్రంతో బిజీగా ఉన్నారు. లైకా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.  ఎస్‌.జె.సూర్య, అంజలి, సునీల్‌ తదితరులు కీలక పాత్రధారులు. 


Updated Date - Apr 08 , 2024 | 12:06 PM