Devara: దేవ‌ర ‘ఫియ‌ర్ సాంగ్’ అప్డేట్.. ఫ్యాన్స్ ర‌చ్చ‌ర‌చ్చ‌

ABN , Publish Date - May 15 , 2024 | 09:12 PM

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత వస్తున్న జూనియర్‌ ఎన్టీఆర్ న‌టిస్తోన్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. తాజాగా అభిమానుల చాలాకాలం వెయిటింగ్‌కు తెర దించుతూ మే 20న ఎన్టీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఓ ఆప్డేట్ ఇచ్చారు.

Devara: దేవ‌ర ‘ఫియ‌ర్ సాంగ్’ అప్డేట్.. ఫ్యాన్స్ ర‌చ్చ‌ర‌చ్చ‌
devara

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత వస్తున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్‌ ఎన్టీఆర్ న‌టిస్తోన్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ (Devara) . రెండు భాగాలుగా వ‌స్తోన్న ఈ చిత్రానికి కొర‌టాల శివ (Koratala Shiva) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోండ‌గా జాన్వీ క‌పూర్ (Janvi kapoor) క‌థానాయుక‌గా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతి నాయ‌కుడిగా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తోండ‌గా ప్రకాష్‌రాజ్‌, శ్రీకాంత్‌, టామ్‌ షైన్‌ చాకో, నరైన్‌ తదితరులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కాగా సినిమాను అక్టోబ‌ర్ 10న విడుద‌ల కానుంది.

తాజాగా అభిమానుల చాలాకాలం వెయిటింగ్‌కు తెర దించుతూ మే 20న ఎన్టీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఓ ఆప్డేట్ ఇచ్చారు. ఫ‌స్ట్ లిరిక్‌కు సంబంధించి డేట్‌ను ప్ర‌క‌టించారు. టాలీవుడ్ నుంచి వ‌స్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అయిన ‘దేవర’(Devara) సినిమా నుంచి ఫ‌స్ట్ సింగ‌ల్‌ను ఫియ‌ర్ సాంగ్‌ను మే 19న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

GNoA2C1XIAEm--r.jpeg


ఇప్ప‌టికే ఈసినిమా నుంచి వ‌చ్చిన గ్లింప్స్ సినిమాపై విప‌రీత‌మైన అంచ‌నాల‌ను పెంచేయంతో అభిమానులు సినిమా గురించి ,ఆప్డేట్స్ గురించి వెయిట్ చేస్తున్నారు. తాజాగా పాట విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తూ మేక‌ర్స్ ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌గా అభిమానులు ఇప్పుడు ఆ పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ చేస్తూ ర‌చ్చ చేస్తున్నారు. దాంతో నేష‌నల్ వైడ్‌గా ప్ర‌ధ‌మ స్థానంలో ట్రెండ్ అవుతోంది.

Updated Date - May 16 , 2024 | 12:41 PM