Police Vaari Hecharika: గజ్వేల్ వేణును.. సంగీత దర్శకుడిగా ప‌రిచ‌యం చేస్తున్నాం

ABN , Publish Date - Apr 16 , 2024 | 06:33 PM

నల్లపూసలు ఫేం బాబ్జీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పోలీస్ వారి హెచ్చరిక. శ‌రవేగంగా టాకీ పార్ట్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది.

Police Vaari Hecharika: గజ్వేల్ వేణును.. సంగీత దర్శకుడిగా ప‌రిచ‌యం చేస్తున్నాం
police vaari hechharika

నల్లపూసలు ఫేం బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం పోలీస్ వారి హెచ్చరిక (Police Vaari Hecharika) శ‌రవేగంగా టాకీ పార్ట్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పాటల చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా దర్శకుడు బాబ్జీ చిత్రం ప్రోగ్రెస్‌ను తెలుపుతూ "అరకులోయ , కాఫీ వనం , ఆపిల్ రిసార్ట్స్ , వైజాగ్ యారాడా బీచ్ , నకిరేకల్ లాండ్స్ , యస్ స్టూడియో మొదలైన లొకేషన్లలో పాటలను చిత్రీకరించామని తెలిపారు.

Police Vaari Hecharika


గత రెండు దశాబ్దాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలోని గాయనీ గాయకులతో ఐదు లక్షల ప్రైవేట్ సాంగ్స్ ను స్వర పరచి సంచలనం సృష్టించి , రెండు రాష్ట్రాలలోని ప్రైవేటు పాటల గాయనీ గాయకులకు , పాటల రచయితలకు అభిమాన పాత్రుడైన సంగీత దర్శకుడు "గజ్వేల్ వేణు"ను ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేస్తున్నామని దర్శకుడు బాబ్జీ తెలిపారు.

Police Vaari Hecharika

చిత్ర నిర్మాత బెల్లి జనార్థన్ మాట్లాడుతూ "రెండు రోజులలో పాటల చిత్రీకరణ పూర్తి అవుతుందని , ఆ వెంటనే నల్గొండలో క్లైమాక్స్ స‌న్నివేశాలను చిత్రీకరించడంతో సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని " తెలిపారు.

Updated Date - Apr 16 , 2024 | 06:53 PM