అంబ‌రాన్నంటిన.. సినీ తార‌ల సంక్రాంతి

ABN , Publish Date - Jan 15 , 2024 | 11:19 AM

రెండు తెలుగు రాష్ట్రాల‌లో సంక్రాంతి పండుగ‌ను అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుకుంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ సెల‌బ్రిటీలకు కూడా చాలా కాలం త‌ర్వాత విశ్రాంతి దొర‌క‌డంతో ఈ వేడుక‌ల్లో పాల్గొంటు ఆ ఫొటోల‌ను, వీడియోల‌ను త‌మ‌ అభిమానుల‌తో పంచుకుంటున్నారు.

అంబ‌రాన్నంటిన.. సినీ తార‌ల సంక్రాంతి
tollywood stars

రెండు తెలుగు రాష్ట్రాల‌లో సంక్రాంతి పండుగ‌ను అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుకుంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ సెల‌బ్రిటీలకు కూడా చాలా కాలం త‌ర్వాత విశ్రాంతి దొర‌క‌డంతో ఈ వేడుక‌ల్లో పాల్గొంటు ఆ ఫొటోల‌ను, వీడియోల‌ను త‌మ‌ అభిమానుల‌తో పంచుకుంటున్నారు. ఇప్ప‌టికే హ‌నుమాన్‌, గుంటూరుకారం, సైంధ‌వ్‌, నా సామిరంగ సినిమాలు థియేట‌ర్ల‌లో విడుద‌లై మంచి ప్రేక్ష‌కాధ‌ర‌ణ‌ల‌తో దూసుకు పోతుండ‌గా ఇంకా చాలామంది త‌మ సినిమాల ఫ‌స్ట్ లుక్‌ల‌ను, వీడియోల‌ను విడుద‌ల చేస్తున్నారు.

dhanush.jpeg

ముఖ్యంగా మంచు మోహ‌న్‌బాబు ఇంట గంగిరెద్దుల ఆట‌ల మ‌ధ్య‌ ఈ వేడుక‌లు క‌న్నుల‌పండువ‌గా సాగుతున్నాయి. ఈ మేర‌కు విడుద‌ల చేసిన వీడియోలో మనుమ‌రాళ్లు, మ‌నువ‌డితో క‌లిసి ఈ సంబురాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా త‌మిళ స్టార్ ధ‌నుష్ త‌న ఇద్ద‌రు కొడుకులు,త‌ల్ల‌దండ్రుల‌తో క‌లిసి దిగిన పొటోను షేర్ చేశారు. న‌య‌న‌తార త‌మిళ‌,తెల‌గు బాష‌ల్లో పండుగ శుభాకాంక్ష‌లు తెలిపింది.

gopi chand.jpeg


vishwak sen.jpeg

ఇదిలాఉండ‌గా ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ఇప్ప‌టికే ప్ర‌భాస్ మారుతి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న రాజాసాబ్‌, గోపీచంద్ భీమా, సూర్య కంగువా నుంచి ఫ‌స్ట్ లుక్‌, అన‌న్య నాగ‌ళ్ల‌ పొట్టేల్, విశ్వ‌క్ సేన్‌ గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావ‌రి, సంపూర్ణేశ్ బాబు న‌టించిన సోద‌ర సినిమాల నుంచి ఫ‌స్ట్ లుక్‌లు విడుద‌ల‌య్యాయి.

vijay.jpeg

మ‌రో త‌మిళ స్టార్ ద‌ల‌ప‌తి విజ‌య్ త‌దుప‌రి చిత్రం గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) నుంచి ఓ స్ట‌న్నింగ్ లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ సాయంత్రం లోపు మ‌రిన్ని విడుద‌ల కానున్నాయి.

Updated Date - Jan 15 , 2024 | 11:19 AM