Team India: ఛాంపియన్స్ కు  శుభాకాంక్షలు.. సినీ తారల సందడి

ABN , Publish Date - Jun 30 , 2024 | 05:40 PM

2024 టీ 20 ప్రపంచకప్‌లో భారత్‌ విజయకేతనం ఎగరేసింది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. దీంతో, దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.

Team India: ఛాంపియన్స్ కు  శుభాకాంక్షలు.. సినీ తారల సందడి

2024 టీ 20 ప్రపంచకప్‌లో భారత్‌ విజయకేతనం ఎగరేసింది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. దీంతో, దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. చిత్ర పరిశ్రమలోనూ జోష్‌ కనిపిస్తోంది. సోషల్‌ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీమ్‌ ఇండియాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

‘‘భారత్‌ ప్రపంచంలో టాప్‌లో ఉంది. 17 ఏళ్ల తర్వాత టీ 20 వరల్డ్‌ కప్‌ గెలవడం ఆనందంగా ఉంది. విరాట్‌ కోహ్లీ, బుమ్రా, హార్దిక్‌, అక్షర్‌, అర్షదీప్‌, కెప్టెన్‌ రోహిత్‌ రోహిత్‌ శర్మ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. సూర్య కుమార్‌ యాదవ్‌ క్యాచ్‌ వావ్‌ అనిపించింది’’
- చిరంజీవి

‘ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. కోహ్లీ యాంకరింగ్‌ ఇన్నింగ్స్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌, సూర్య కుమార్‌ క్యాచ్‌, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ కెప్టెన్సీ ప్రశంసనీయం. ఇది చరిత్రాత్మక విజయం. నిశ్శబ్దంగా తన మార్గనిర్దేశంలో కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ భారత్‌ను విజయ తీరాలకు చేర్చారు. మనం ఛాంపియన్స్‌, మనం అజేయులం, మనం భారరతీయులం’’
- కమల్‌ హాసన్‌

 
‘‘ఇండియాకు అనూహ్య విజయం. టీమిండియా ప్రదర్శన అమోఘం. జస్‌ప్రీత్‌ బుమ్రా అదరహో. విరాట్‌ కోహ్లీ, హార్దిక్‌ పాండ్యా పెర్ఫామెన్స్‌ అద్భుతం. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు వందనాలు. ఎప్పటికీ మర్చిపోలేని విజయాన్ని అందించిన భారత జట్టుకు శుభాకాంక్షలు’’
- రామ్‌ చరణ్‌

‘‘విజయం మనదే. అలుపెరగకుండా పోరాచిన టీమ్‌ ఇండియాకు అభినందనలు. సూర్యకుమార్‌ యాదవ్‌ క్యాచ్‌ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ చరిత్రాత్మక విజయం చూస్తే ఎంతో గర్వంగా ఉంది’’
- మహేశ్‌బాబు

idnia.jfif

‘‘మ్యాచ్‌ గెలిచామన్న భావోద్వేగంతో ప్లేయర్స్‌ కంటతడి పెట్టుకున్న దృశ్యాలను టీవీలో చూసిన నా కుమార్తె చలించింది. ఎవరైనా వారిని ఆలింగనం చేసుకుంటే బాగుంటుందని అనుకుంది. డార్లింగ్‌ నువ్వు బాధపడకు.. వారిని 150 కోట్ల భారతీయులు ప్రేమతో కౌగిలించుకుంటున్నారు. ఛాంపియన్స్‌ కంగ్రాట్స్‌. విరాట్‌ కోహ్లీ.. నువ్వు నా వాడివి అని చెప్పుకొనేందుకు కృతజ్ఞురాలిని’’ - అనుష్క శర్మ  

''మ్యాచ్‌ అదిరిపోయింది. ఎంతో గర్వంగా ఉంది. కంగ్రాట్స్‌ టీమ్‌ఇండియా’’
- ఎన్టీఆర్‌  

‘‘టీ 20 వరల్డ్‌ కప్‌ విజేత టీమ్‌ఇండియాకు కంగ్రాట్స్‌’’

- అల్లు అర్జున్‌

‘‘కంగ్రాట్స్‌ టీమ్‌ ఇండియా. ఈ మ్యాచ్‌ను ఎంతగానో ఆస్వాదించా. భారతీయులందరూ గర్వించేలా చేశారు’’
- ఆమిర్‌ ఖాన్‌

‘‘సమయం వచ్చింది.. ఇండియా గెలిచింది’’

- ‘కల్కి 2898 ఏడీ’ టీమ్‌

‘‘లవ్‌ యూ ఛాంపియన్స్‌. ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్‌ను మాకు ఇచ్చినందుకు భారతజట్టుకు కృతజ్ఞతలు. జై హింద్‌’’

- సాయిధుర్గ తేజ్‌

Updated Date - Jun 30 , 2024 | 05:50 PM