Megastar Chiranjeevi: పద్మ విభూషణ్‌ చిరు.. సెలబ్రిటీలు ఏమన్నారంటే..! 

ABN , Publish Date - Jan 26 , 2024 | 04:14 PM

టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవికి పద్మవిభూషణ్‌ పురస్కారం రావడంపై సినీ ప్రముఖులు, తెలుగు ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.

Megastar Chiranjeevi: పద్మ విభూషణ్‌ చిరు.. సెలబ్రిటీలు ఏమన్నారంటే..! 

టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవికి పద్మవిభూషణ్‌ పురస్కారం రావడంపై సినీ ప్రముఖులు, తెలుగు ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. వెంకటేష్, నాగార్జున, మోహన్‌బాబు, మహేష్‌బాబు, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్, రవితేజ, దర్శకులు కె.రాఘవేంద్రరావు, రాజమౌళి, సుకుమార్‌, గుణశేఖర్‌, కె.ఎస్‌.రవీంద్ర, గోపీచంద్‌ మలినేని, మారుతి, ప్రశాంత్ వర్మ తదితరులు ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 

‘‘బాల రాముడి దర్శనం అయ్యాక మీకు పద్మ విభూషణ్‌ దక్కడం చాలా సంతోషంగా ఉంది. మీ విషయంలో ఎప్పటికీ గర్వపడుతూనే ఉంటా బాబాయ్‌. కంగ్రాట్స్‌’’ 

- దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు

‘‘నా ప్రియ మిత్రుడు చిరంజీవికి పద్మ విభూషణ్‌ రావడంతో ఎంతో ఆనందంగా ఉంది. ఈ పురస్కారానికి మిమ్మల్ని మించిన అర్హుడు ఎవరు లేరని నా అభిప్రాయం. చాలా గర్వంగా ఉంది మిత్రమా’’ 

- వెంకటేష్‌

‘‘పద్మ విభూషణ్‌ పురస్కారంతో నా మిత్రుడు చిరంజీవి గౌరవించబడటం చాలా ఆనందంగా ఉంది. ఆయనకు మిత్రుడిని అయినందుకు గర్వంగా ఉంది. కంగ్రాట్‌ మై డియర్‌ చిరంజీవి’’.

- అక్కినేని నాగార్జున

‘‘మా లెజండరీ చిరంజీవి గారికి పద్మవిభూషణ్‌ రావడంతో ఎంతో గౌరవంగా ఉంది. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు తగిన గుర్తింపు ఇది’’

- మహేష్‌బాబు

‘‘పునాది రాళ్లు’తో నటుడిగా తొలి అడుగు వేసిన ఒక సాధారణ యువకుడు కుర్రాడు.. దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారానికి ఇప్పుడు ఎంపికయ్యారు. మీ ప్రయాణం ఎన్నో తరాలకు స్ఫూర్తి. పద్మవిభూషణ్‌ అవార్డుకు ఎంపికైనందుకు హృదయపూర్వక అభినందనలు’’ 

టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవికి పద్మవిభూషణ్‌ పురస్కారం రావడంపై సినీ ప్రముఖులు, తెలుగు ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.

‘‘పద్మవిభూషణ్‌ మెగాస్టార్‌ చిరంజీవి కంగ్రాట్స్‌ అన్నయ్య. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం’’ 

- రవితేజ

‘‘డ్రీమ్‌ బిగ్‌’ అంటూ ఎన్నో తరాల్లో ప్రేరణ నింపారాయన.  మంచి మనసు, గొప్ప లెగసీ కలిగిన చిరంజీవిని భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో సత్కరించడం ఎంతో సంతోషంగా ఉంది’’ 

- నాగవంశీ

‘‘పద్మవిభూషణ్‌ అవార్డుకు చిరంజీవిగారిని ఎంపిక చేశారనే అద్భుతమైన వార్తతో నిద్ర లేచా. తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడే క్షణాలు ఇవి. కంగ్రాట్స్‌ మెగాస్టార్‌ చిరంజీవిగారు’’ 

- మంచు విష్ణు

‘‘నాకు బాగా నచ్చిన ఫొటో ఇదే. ఎల్లప్పుడూ నాపట్ల దయ, ఆప్యాయంగా ఉన్నందుకు.. మనసును హత్తుకునే ప్రదర్శనలతో అద్బు?తమైన చిత్రాలను అందించినందుకు.. మా ‘మెగాస్ట్టార్‌’గా నిలిచినందుకు ధన్యవాదా?ని. ఇకపై మీరు పద్మవిభూషణ్‌ చిరంజీవి’’ 

- అడివి శేష్‌


Updated Date - Jan 26 , 2024 | 06:50 PM