Raju Yadav: యశస్వి కొండేపూడి వోక‌ల్‌.. ఫీల్ మై స్మైల్ పాట విడుద‌ల‌

ABN , Publish Date - May 23 , 2024 | 08:50 AM

బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను 'రాజు యాదవ్‌’ తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ఫీల్ మై స్మైల్ అంటూ సాగే పాట‌ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ లాంచ్ చేసి చిత్ర‌ యూనిట్ కి అభినందనలు తెలిపారు.

Raju Yadav: యశస్వి కొండేపూడి వోక‌ల్‌.. ఫీల్ మై స్మైల్ పాట విడుద‌ల‌
raju yadav

బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను (Getup Srinu) హోల్సమ్ ఎంటర్ టైనర్ 'రాజు యాదవ్స‌ (Raju Yadav) తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. మే 24న రాజు యాదవ్ విడుదల కానుంది.

207856e3-3abd-4784-afb6-d7bf8e835f99.jpeg

తాజాగా ఈ 'రాజు యాదవ్‌' (Raju Yadav) సినిమా నుంచి ఫీల్ మై స్మైల్ అంటూ సాగే పాట‌ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ లాంచ్ చేసి చిత్ర‌ యూనిట్ కి అభినందనలు తెలిపారు. స్టార్ కంపోజర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ పాటని ఫీల్ గుడ్ మెలోడీ నెంబర్ గా కంపోజ్ చేశారు. కాసర్ల శ్యాం అందించిన లిరిక్స్ అద్భుతంగా ఆకట్టుకున్నాయి. యశస్వి కొండేపూడి తన లవ్లీ వాయిస్ తో మెస్మరైజ్ చేశాడు. ఈ పాటలో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది.


1537837d-fb03-4bdb-9588-e27334b88edd.jpeg

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఏపీ, తెలంగాణలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. కాగా ఈ రాజు యాదవ్ (Raju Yadav) చిత్రం.. లవ్, కామెడీతో పాటు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో అలరించనుంది.

Updated Date - May 23 , 2024 | 08:50 AM