Family Star: గుమ్మడికాయ కొట్టేశారు

ABN , Publish Date - Mar 16 , 2024 | 07:24 PM

విజయ్ దేవరకొండ నటిస్తున్న "ఫ్యామిలీ స్టార్" సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది.  సినిమా టీం గుమ్మడికాయ కొట్టేశారు. ఫ్యామిలీ స్టార్ షూట్ కంప్లీట్ అని చెబుతూ మేకర్స్ ఒక వీడియో రిలీజ్ చేశారు.

Family Star: గుమ్మడికాయ కొట్టేశారు

విజయ్ దేవరకొండ (Vijay devarakonda) నటిస్తున్న 'ఫ్యామిలీ స్టార్' (Family star) సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది.  సినిమా టీం గుమ్మడికాయ కొట్టేశారు. ఫ్యామిలీ స్టార్ షూట్ కంప్లీట్ అని చెబుతూ మేకర్స్ ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో మృణాల్, విజయ్, పరశురామ్ పెట్ల (parasuram)ఒకరినొకరు అఫెక్షన్ తో హగ్ చేసుకుంటున్న క్లిప్ ఉంది. విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన లిరికల్ సాంగ్స్, టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. 

Updated Date - Mar 16 , 2024 | 07:24 PM