Double iSmart: ఈసారి రెట్టింపు ఎంటర్‌టైన్మెంట్‌తో..

ABN , Publish Date - May 04 , 2024 | 01:41 PM

'ఇస్మార్‌ శంకర్‌' (Ismart shankar) బ్లాక్‌బస్టర్‌ తర్వాత రామ్‌ పోతినేని(Ram pothineni), పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) కాంబినేషన్లో  'డబుల్‌ ఇస్మార్ట్‌' (Double iSmart) చిత్రం ప్రారంభించిన సంగతి తెలిసిందే. పలు కారణాల వల్ల ఈ చిత్రం షూటింగ్‌ వాయిదా పడింది.

Double iSmart: ఈసారి రెట్టింపు ఎంటర్‌టైన్మెంట్‌తో..


'ఇస్మార్‌ శంకర్‌' (Ismart shankar) బ్లాక్‌బస్టర్‌ తర్వాత రామ్‌ పోతినేని(Ram pothineni), పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) కాంబినేషన్లో  'డబుల్‌ ఇస్మార్ట్‌' (Double iSmart) చిత్రం ప్రారంభించిన సంగతి తెలిసిందే. పలు కారణాల వల్ల ఈ చిత్రం షూటింగ్‌ వాయిదా పడింది. అందుకు కారణం హీరో రామ్‌ రెమ్యునరేషన్ విషయంలో ఇబ్బంది పెడుతున్నాడనీ, అందుకే షూటింగ్‌ ఆగిందని వార్తలొచ్చాయి. అయితే వార్తలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు మేకర్స్‌. అంతే కాదు రామ్‌ షూటింగ్‌ సెట్‌లో అడుగుపెట్టడానికి రెడీగా ఉన్నారని సన్నిహితులు సమాచారం కూడా ఇచ్చారు. దీంతో ఆ గొడవకు అక్కడితో ముగింపు పడింది.


తాజాగా దర్శకుడు డబుల్‌ ఇస్మార్ట్‌ షూటింగ్‌ షురూ చేశారు. ముంబైలో తాజా షెడ్యూల్‌ ప్రారంభించారు పూరి. భారీగా ప్లాన చేసిన ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. దీంతో సినిమా మేజర్‌ పార్ట్‌ పూర్తవుతుంది. 'ఇస్మార్ట్‌ శంకర్‌' బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కావడంతో దానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని మరింత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించనున్నారు పూరి. ఈ చిత్రంలో యాక్షన్, మాస్‌ ఎలిమెంట్స్‌, ఎంటర్‌టైనమెంట్‌ రెట్టింపు ఇవ్వబోతున్నాం అని టీమ్‌ నమ్మకం వ్యక్తం చేస్తోంది. రామ్‌ స్టైలిష్‌ లుక్‌, పెర్‌ఫార్మెన్స్  సంజయ్‌దత్  పవర్‌ఫుల్‌ రోల్‌, మణిశర్మ సంగీతం, పూరి జగన్నాథ్‌ టేకింగ్‌ మరోస్థాయిలో ఉంటాయని మేకర్స్‌ చెబుతున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ మొదలుపెట్టిన ఫొటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 

Updated Date - May 04 , 2024 | 01:42 PM