Dirty Fellow: ఎక్క‌డా లాగ్ ఉండ‌దు.. నలుగురు హీరోయిన్స్ ఉన్నారు

ABN , Publish Date - May 21 , 2024 | 03:51 PM

ఇండియన్ నేవీలో పనిచేసిన సోల్జర్ శాంతి చంద్ర హీరోగా నటిస్తున్న సినిమా ‘డర్టీ ఫెలో’. ఈ చిత్రంలో దీపిక సింగ్, సిమ్రితీ బతీజా , నిక్కిషా రంగ్ వాలా హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ‘ఈ సినిమా ఈ నెల 24న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

Dirty Fellow:  ఎక్క‌డా లాగ్ ఉండ‌దు.. నలుగురు హీరోయిన్స్ ఉన్నారు
dirty fellow

ఇండియన్ నేవీలో పనిచేసిన సోల్జర్ శాంతి చంద్ర (Santhi chandra) హీరోగా నటిస్తున్న సినిమా ‘డర్టీ ఫెలో’(Dirty Fellow). ఈ చిత్రంలో దీపిక సింగ్, సిమ్రితీ బతీజా (simrithi bathija), నిక్కిషా రంగ్ వాలా (nikkesha) హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ‘డర్టీ ఫెలో’ చిత్రాన్ని గుడూరు భద్రకాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై జి శాంతి బాబు నిర్మిస్తున్నారు. ఆడారి మూర్తి సాయి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 24న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, హీరో సంపూర్ణేష్ బాబు గెస్ట్ లుగా పాల్గొన్నారు.

WhatsApp Image 2024-05-21 at 3.13.06 PM (1).jpeg

ఈ సందర్భంగా హీరో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.. శాంతి చంద్ర నాకు ఒక బ్రదర్ లాంటి వ్యక్తి. సినిమాకు డర్టీ ఫెలో టైటిల్ ఎందుకు పెట్టారని అడిగాను. ఈ సినిమాకు ఆ టైటిల్ తప్ప మరో ఛాయిస్ లేదని డైరెక్టర్ చెప్పారు. సినిమా మీద ప్యాషన్ ఉన్న శాంతి చంద్ర అన్న హీరోగా ఈ మూవీ చేస్తుండటం సంతోషంగా ఉంది. డర్టీ ఫెలో (Dirty Fellow) సినిమా పాటలు, ట్రైలర్ చూశాను. మంచి కథతో వస్తున్న ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నా అన్నారు. దర్శకుడు వీరశంకర్ మాట్లాడుతూ.. శాంతి చంద్ర ఎక్స్ సర్వీస్ మెన్. దేశానికి సేవలు అందించాడు. డర్టీ ఫెలో సినిమాతో హీరోగా పరిచయమవుతున్నారు. ఆయనకు సినిమా అంటే ప్యాషన్. డైరెక్టర్ మూర్తి సాయి, మూవీ టీమ్ సినిమాను జాగ్రత్తగా రూపొందించారు. రష్ రీ చెక్ చేసుకుంటూ బెటర్ మెంట్స్ చేసుకుంటూ వచ్చారు. నేను ఒక గైడ్ గా ఉన్నానంతే. వీళ్లు నాకు చాలా కావాల్సిన వాళ్లు అందుకే ఈ ఈవెంట్ కు వచ్చాను. మాస్ అంశాలతో యాక్షన్ ఎంటర్ టైనర్ గా డర్టీ ఫెలో ఆకట్టుకుంటుంది. సినిమాను ఈ నెల 24న థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండని అన్నారు.

WhatsApp Image 2024-05-21 at 3.13.06 PM.jpeg


హీరోయిన్ దీపిక సింగ్ మాట్లాడుతూ.. డర్టీ ఫెలో (Dirty Fellow) సినిమా కోసం హార్ట్ అండ్ సోల్ పెట్టి పనిచేశాం. మా బెస్ట్ వర్క్ ఇచ్చాం. సినిమా మీకు నచ్చుతుందనే ఆశిస్తున్నాం. ఈ నెల 24న థియేటర్స్ లో డర్టీ ఫెలో చూడండి అన్నారు. హీరోయిన్ సిమ్రితి బతీజా మాట్లాడుతూ.. మా మూవీ ఈవెంట్ కు వచ్చిన వారందరికీ థ్యాంక్స్. తెలుగులో నేను నటిస్తున్న మొదటి చిత్రమిది. ఈ అవకాశం ఇచ్చిన శాంతి చంద్రకు థ్యాంక్స్. షూటింగ్ టైమ్ లో చాలా సపోర్ట్ చేశాడు. మీడియా సపోర్ట్ ఉంటే మా మూవీ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. డర్టీ ఫెలో సినిమా చూడండి. సినిమా మీకు నచ్చితే మాకు తెలియజేయండి అన్నారు. హీరోయిన్ నికిష రంగ్ మాట్లాడుతూ - తెలుగులో నేను నటిస్తున్న రెండో చిత్రమిది. గ్లామర్ తో పాటు పర్ ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న మంచి క్యారెక్టర్ లో కనిపిస్తాను. డర్టీ ఫెలో మూవీ బాగుంటుంది. థియేటర్స్ లో తప్పకచూడండని అన్నారు. దర్శకుడు ఆడారి మూర్తి సాయి మాట్లాడుతూ డర్టీ ఫెలో సినిమాకు పనిచేసిన వాళ్లంతా ఒక కుటుంబంలా పనిచేశార‌ని.. మన ఇంట్లో వాళ్లను పొగడాల్సిన అవసరం లేదు.సినిమాను థియేటర్ లోనే చూడండి. చిన్న సినిమాలను బతికించండని అన్నారు.

WhatsApp Image 2024-05-21 at 3.13.05 PM.jpeg

హీరో శాంతి చంద్ర మాట్లాడుతూ.. ఈ సినిమా మేకింగ్ లో గైడ్ చేస్తూ మమ్మల్ని నడిపించిన డైరెక్టర్ వీరశంకర్ గారికి థాంక్స్ నా గురించి చెప్పుకోవాలంటే సినిమానే నా జీవితం. సినిమానే నా ఆలోచన. నా నాలుగో ఏటనే మా నాన్న చనిపోయారు. చిన్నప్పటి నుంచి నేను ఏం చేసినా కెమెరా నన్ను ఫాలో అవుతుందనే ఫీల్ అయ్యేవాడిని. ఇండియన్ నేవీలో చేరాక అక్కడ మేము చేసే సాహసాల టైమ్ లోనూ కెమెరా ఉందనే అనిపించేది. ఎప్పటికైనా హీరో కావాలనే కలగన్నాను. మంత్ర సినిమాతో ఆ కోరిక తీరింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో కొంత గ్యాప్ వచ్చింది. బిజినెస్ చేస్తూ ఇక్కడ మూవీస్ చేయలేకపోయా. ఇక్కడ స్థిర పడాలంటే ఇక్కడే ఉండాలి. కొంతకాలం తర్వాత మూర్తి సాయి, డాక్టర్ సతీష్, ఇతర టీమ్ కలిశారు. వాళ్లను చూశాక ఇది రైట్ టీమ్ అనిపించింది. అలా డర్టీ ఫెలో సినిమా మొదలుపెట్టాం. డర్టీ ఫెలో కథను నమ్మి ఇన్వెస్ట్ చేశా అన్నారు. మా సినిమాలో నలుగురు హీరోయిన్స్ ఉన్నారు గ్లామర్ ఉంటుందన్నారు. డర్టీ ఫెలో ఒక డిఫరెంట్ మూవీ. ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్, యాక్షన్, రొమాన్స్ అన్నీ ఉంటాయి. ఎక్కడా ల్యాగ్ ఉండదు. మా సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. ఇది ధమాకా, బ్లాస్ట్ లాంటి సక్సెస్ అందుకుంటుందన్నారు.

Updated Date - May 21 , 2024 | 04:06 PM