Directors association: దర్శకుల సంఘం అధ్యక్షుడిగా వీరశంకర్‌!

ABN , Publish Date - Feb 11 , 2024 | 06:22 PM

తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా (Directors association) దర్శకుడు వీరశంకర్‌ ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌లో జరిగిన ఎన్నికల్లో వీర శంకర్‌ ప్యానల్‌ విజయం సాధించింది.

Directors association: దర్శకుల సంఘం అధ్యక్షుడిగా వీరశంకర్‌!


తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా (Directors association) దర్శకుడు వీరశంకర్‌ ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌లో జరిగిన ఎన్నికల్లో వీర శంకర్‌ ప్యానల్‌ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో వీర శంకర్‌, సముద్ర ప్యానళ్లు బరిలోకి దిగాయి. దర్శకుల సంఘంలో 1500 మంది యాక్టివ్‌ మెంబర్స్‌ ఉన్నారు. ఈ రోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్‌ జరిగింది. సాయంత్రం 5 గంటలకే ఫలితాలు వెల్లడించారు. వీర శంకర్‌ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. మొత్తం 1113 ఓట్లు పోల్‌ కాగా, ఇందులో వీరశంకర్‌కు 536, సముద్రకు 304 వచ్చాయి.  దర్శకుల సంఘం ప్రెసిడెంట్‌గా వీరశంకర్‌, వైస్‌ ప్రెసిడెంట్స్‌గా వశిష్ఠ, సాయి రాజేష్‌, జనరల్‌ సెక్రటరీలుగా మద్దినేని రమేష్‌, సుబ్బారెడ్డి. ట్రెజరర్‌గా పి.వి.రమణరావు ఎంపికయ్యారు. 


Updated Date - Feb 11 , 2024 | 06:22 PM