Sukumar Writings: సుకుమార్‌ను మెప్పించి.. ఛాన్స్ కొట్టేసిన‌ ‘సిద్దార్థ్ రాయ్’ ద‌ర్శ‌కుడు

ABN , Publish Date - Jan 08 , 2024 | 03:21 PM

త్వరలో విడుదల కానున్న ‘సిద్దార్థ్ రాయ్’ చిత్ర ద‌ర్శ‌కుడు య‌శ్వసికి క్రియేటివ్ జీనియ‌స్ సుకుమార్‌ తన సుకుమార్ రైటింగ్స్‌ బ్యానర్లో అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఈ విషయం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

Sukumar Writings: సుకుమార్‌ను మెప్పించి.. ఛాన్స్ కొట్టేసిన‌ ‘సిద్దార్థ్ రాయ్’ ద‌ర్శ‌కుడు
Siddharth Roy

ప్ర‌తిభ గ‌ల క‌ళాకారుల‌ను, సాంకేతిక నిపుణుల‌ను ప్రోత్స‌హించ‌డంలో క్రియేటివ్ జీనియ‌స్ ద‌ర్శ‌కుడు సుకుమార్ ఎల్ల‌ప్పుడూ ముందు వ‌రుస‌లో ఉంటారు. ఆయ‌న ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసి తొలిచిత్రంతోనే బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాలు అందుకున్న ద‌ర్శ‌కులు కొంద‌రైతే, ఆయ‌న‌ను త‌మ గురువుగా భావించి ఏక‌ల‌వ్య శిష్యులుగా మారిపోయి సినిమాలు తెర‌కెక్కించే ద‌ర్శ‌కులు మ‌రికొంద‌రు ఉన్నారు.

అలా ఏక‌ల‌వ్య శిష్యుడి జాబితాలోని వ్య‌క్తే ద‌ర్శ‌కుడు య‌శ‌స్వి వి దీప‌క్ స‌రోజ్ హీరోగా య‌శ‌స్వి (director Yeshasvi) ‘సిద్దార్థ్ రాయ్’ (Siddharth Roy) పేరుతో ఓ వైవిధ్య‌మైన ప్రేమ‌క‌థా చిత్రాన్ని రూపొందించాడు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా సిద్దార్థ్ రాయ్ చిత్రం విష‌యంలో య‌శ్వ‌సి ప్ర‌తిభ‌ను చూసి ద‌ర్శ‌కుడు సుకుమార్‌ ఎంతో ఇంప్రెస్ అయ్యారు.


అందుకే సుకుమార్ త‌న సొంత నిర్మాణ సంస్థ అయిన సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings) సంస్థ‌లో య‌శ‌స్వి త‌దుప‌రి చిత్రం చేసే అవ‌కాశం ఇచ్చారు. ఇప్ప‌టికే సుకుమార్ రైటింగ్స్‌లో ప‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలు నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సుకుమార్ రైటింగ్స్ సంస్థ ప‌లు అగ్ర నిర్మాణ సంస్థ‌ల‌తో క‌లిసి పాన్ ఇండియా చిత్రాల‌తో పాటు విభిన్న‌మైన, వైవిధ్య‌మైన చిత్రాల‌ను నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Updated Date - Jan 08 , 2024 | 03:24 PM