Surya Kiran: సత్యం దర్శకుడు సూర్యకిరణ్‌ ఇకలేరు!

ABN , Publish Date - Mar 11 , 2024 | 02:22 PM

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. తెలుగులో 'సత్యం’(Satyam) చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సూర్యకిరణ్‌ కన్ను మూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు.

Surya Kiran:  సత్యం దర్శకుడు సూర్యకిరణ్‌ ఇకలేరు!

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. తెలుగులో 'సత్యం’(Satyam) చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సూర్యకిరణ్‌ కన్ను మూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. మాస్టర్‌ సురేష్‌ పేరుతో 200లకు పైగా చిత్రాల్లో బాలనటుడిగా, సహాయ నటుడిగా నటించిన ఆయన తెలుగులో 'సత్యం' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. అప్పటి నుంచి ఆయన పేరు సూర్యకిరణ్‌గా మార్చుకున్నారు. ఆ తర్వాత 'ధన 51, 'బ్రహ్మాస్త్రం', 'రాజుభాయ్‌', 'చాప్టర్‌ 6' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. తమిళంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ నటించిన 'అరసి’ చిత్రానికి ఆయనే దర్శకుడు. బిగ్ బాస్' తెలుగు సీజన్ 4 లో కంటెస్టెంట్ హౌస్ లో అడుగుపెట్టారు. టి.వి నటి సుజిత సూర్య కిరణ్ కు స్వయానా చెల్లి అవుతుంది.  హీరోయిన్ కల్యాణిని ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు.  

Surya.jpg

తెలుగులో 'రాక్షసుడు', 'దొంగమొగుడు', 'స్వయం కృషి', 'సంకీర్తన', 'ఖైదీ నం.786', 'కొండవీటి దొంగ' చిత్రాల్లో నటించారు. బాలనటుడిగా కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు అవార్డులను, దర్శకుడిగా రెండు నంది పురస్కారాలను అందుకున్నారు. సూర్యకిరణ్‌ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి.

Updated Date - Mar 11 , 2024 | 03:22 PM