Honeymoon Express: రొమాంటిక్.. కామెడీ మూవీగా హనీమూన్ ఎక్స్ ప్రెస్

ABN , Publish Date - Jun 13 , 2024 | 06:38 PM

చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా తెర‌కెక్కిన చిత్రం హనీమూన్ ఎక్స్ ప్రెస్. ఈ నెల 21న వరల్డ్ వైడ్ థియేటర్లలో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.

Honeymoon Express: రొమాంటిక్.. కామెడీ మూవీగా హనీమూన్ ఎక్స్ ప్రెస్
Honeymoon Express

చైతన్య రావ్ (Chaitanya Rao), హెబ్బా పటేల్ (Hebah) జంటగా తెర‌కెక్కిన చిత్రం హనీమూన్ ఎక్స్ ప్రెస్ (Honeymoon Express). న్యూ రీల్ ఇండియా బ్యానర్ (New Reel India Entertainments Pvt Ltd)పై కేకేఆర్, బాలరాజ్ ఈ సినిమాను నిర్మించ‌గా ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీగా దర్శకుడు బాల రాజశేఖరుని (Bala Rajasekharuni) రూపొందించారు. హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా ఈ నెల 21న వరల్డ్ వైడ్ థియేటర్లలో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో గురువారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి విజ‌యేంద్ర ప్ర‌సాద్‌, అవ‌స‌రాల శ్రీనివాస్, ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్ వంటి ప్ర‌ముఖులు ముఖ్య అతిథులుగా హ‌జ‌ర‌య్యారు.

WhatsApp Image 2024-06-13 at 5.36.05 PM.jpeg

ఈ సంద‌ర్భంగా దర్శకుడు, నటుడు అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. నేను యూఎస్ లో ఉన్నప్పుడు ఈమెయిల్స్ ద్వారా డైరెక్టర్ బాల గారిని అప్రోచ్ అయ్యాను. ఆయన మూవీకి పనిచేయాలని ఉందని అడిగి బాల గారు రూపొందించిన బ్లైండ్ యాంబిషన్ సినిమాకు ఒక షెడ్యూల్ అయ్యాక జాయిన్ అయ్యాను. అలా నేను ఫస్ట్ నేను వర్క్ చేసిన మూవీ ఆయనదే. స్క్రిప్ట్ రైటింగ్ లో మంచి బుక్స్ ను బాల నాకు సజెస్ట్ చేసేవారు. అలా స్క్రిప్ట్ రైటింగ్ లోనూ అవగాహన తెచ్చుకున్నా. బాల తెలుగులో తన తొలి సినిమాను హనీమూన్ ఎక్స్ ప్రెస్ పేరుతో చేయడం సంతోషంగా ఉంది. నేను మొదట్లో దర్శకుడిగా సినిమా చేసేప్పుడు ఆయన సలహాలు తీసుకునేవాడిని. బాల గారి ఫస్ట్ తెలుగు సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాన‌ని అన్నారు.


దర్శకుడు బాల రాజశేఖరుని (Bala Rajasekharuni) మాట్లాడుతూ.. మా మూవీకి నాగార్జున గారు, అమల గారు, రాఘవేంద్రరావు గారు, ఆర్జీవీ గారు, విజయేంద్రప్రసాద్ గారు..ఇలా చాలామంది సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. నాగార్జున గారు ముందు ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రమోషన్ కు అమలగారు ముందుకొచ్చారు. వారు ఇచ్చిన ఎంకరేజ్ మెంట్ తో హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా సక్సెస్ ఫుల్ గా మీ ముందుకు తీసుకొస్తున్నాం. అన్నారు. ఈ సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చేలా రూపొందించామ‌న్నారు. కల్యాణి మాలిక్ పాటలు బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. మంచి రొమాంటిక్ కామెడీ మూవీగా హనీమూన్ ఎక్స్ ప్రెస్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు. రైటర్ విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. హనీమూన్ ఎక్స్ ప్రెస్ మూవీ జంట చైతన్య రావ్, హెబ్బా పటేల్ బాగున్నారు. దర్శకుడు బాల మంచి డైరెక్టర్. హాలీవుడ్ లో మూవీస్ చేశాడు. ఇప్పుడు తెలుగులో దర్శకుడిగా అడుగుపెడుతున్నాడు. అతనితో పాటు టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా అన్నారు.

WhatsApp Image 2024-06-13 at 5.36.06 PM.jpeg

హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ.. ప్రతి నటుడికి అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ చేయాలనే కోరిక ఉంటుంది. నాకు అలాంటి అవకాశం హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా ద్వారా దక్కింది. దర్శకుడు బాల గారిలో హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఉంటుంది. డైరెక్టర్ బాల ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడే హ్యాపీగా ఫీలయ్యా. లవర్స్, పెళ్లి చేసుకోబోయే వాళ్లు, పెళ్లి చేసుకున్నకొత్త జంట, పెళ్లై ఇరవై ఏళ్లయిన జంటలు ప్రతి ఒక్కరికీ నచ్చేలా,వాళ్లందరికీ రిలేట్ అయ్యే అంశాల‌తో ఎంటర్ టైనింగ్ గా సినిమాను రూపొందించారు.మా దర్శకుడు. హెబ్బాతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మా మ్యూజిక్ డైరెక్టర్ కల్యాణి మాలిక్ గారు సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చారన్నారు. హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడుతూ.. మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి సపోర్ట్ చేసిన గెస్ట్ లు అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాతో ఎగ్జైటింగ్, ఇంట్రెస్టింగ్ జర్నీ చేశాము. ఈ నెల 21న హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా రిలీజ్ కు వస్తోంది. మీరంతా థియేటర్స్ లో చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా అన్నారు.

Updated Date - Jun 13 , 2024 | 07:34 PM