నా గురించి తప్పుగా రాస్తే తాట తీస్తా: దిల్ రాజు

ABN , Publish Date - Jan 08 , 2024 | 06:05 PM

ఎప్పుడూ కూల్ గా మాట్లాడే దిల్ రాజు ఈసారి ఫైర్ అయ్యారు. తన గురించి రెండు గాసిప్ వెబ్ సైట్స్ ఇష్టమొచ్చినట్టు రసాయని, ఇకపై సైలెంట్ గా ఉండను అని ఆ రాసిన వెబ్ సైట్స్ 'తాట తీస్తా' అని హెచ్చరించారు.

నా గురించి తప్పుగా రాస్తే తాట తీస్తా: దిల్ రాజు
Dil Raju gets angry on some gossip websties

ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఈరోజు రెండు గాసిప్ వెబ్ సైట్స్ కి వార్నింగ్ ఇచ్చారు. తన మీద లేనిపోనివన్నీ రాసి, తనను వాడుకుంటే ఈరోజు నుండి అలాంటి వెబ్ సైట్స్ ని వదిలేది లేదని ఖరాఖండీగా చెప్పేసారు. ఒక సినిమా ప్రచార చిత్రంలో భాగంగా ఈరోజు దిల్ రాజు ప్రత్యేక అతిధిగా వచ్చారు. ఈ సందర్భంగా అతను తన గురించి ఒక గాసిప్ వెబ్ సైట్ లో వచ్చిన వార్త గురించి స్పందిస్తూ ప్రతి సంక్రాంతికి నాపై ఇలా బురద జల్లడం అలవాటు అయిపోయిందని, కొన్ని వార్తలని తెలియకుండా, వక్రీకరించి రాస్తున్నారని, ఇకపై ఆలా రాస్తే ఊరుకునేది లేదని, 'తాట తీస్తాను' అని హెచ్చరించారు.

నిన్న 'హనుమాన్' #HanuMan సినిమా ఫంక్షన్ కి మెగా స్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ముఖ్య అతిధిగా హాజరయి, దిల్ రాజు ఇంతకుముందు చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేశారు. ఒక సంక్రాంతి పండగకి నా 150వ సినిమా, బాలకృష్ణ గారి సినిమా విడుదలవుతుంటే, దిల్ రాజు తన సినిమా 'శతమానం భవతి' కూడా విడుదల చెయ్యడానికి సంసిద్ధం అయ్యారు. అప్పుడు నేను దిల్ రాజుతో రెండు పెద్ద సినిమాలు వున్నాయి కదా, నీ సినిమా డిలే చేస్తే బాగుంటుంది కదా అంటే, దానికి దిల్ రాజు 'శతమానం భవతి' కంటెంట్ బాగుంటుంది, రెండు పెద్ద సినిమాల మధ్య ఈ సినిమా కూడా ఆడుతుంది అని చెప్పారు,' అని చిరంజీవి అప్పటి మాటలు గుర్తు చేసి, 'ఈ హనుమాన్ సినిమా కూడా ఆడుతుంది' అని చెప్పారు. అంటే ఎన్ని పెద్ద సినిమాలు విడుదలవుతున్న కంటెంట్ బాగుంటే చిన్న సినిమా కూడా ఆడుతుంది అని అర్థం వచ్చేలా చెప్పారు చిరంజీవి.

ఆ మాటలకి కొన్ని వెబ్ సైట్స్ దిల్ రాజు మీద చిరంజీవి విమర్శలు గుప్పించారు అంటూ వక్రీకరించి రాశాయని ఆలా ఇకపై నామీద తప్పుడు వార్తలు రాస్తే 'తాట తీస్తా' అని చెప్పారు దిల్ రాజు. 'హనుమాన్ సినిమాని 12న కాకుండా 14న విడుదల చేస్తే ఎక్కువ థియేటర్స్ దొరుకుతాయని చెప్పాను, అంతే కానీ, విడుదల ఆపొద్దు అని చెప్పలేదు' అని చెప్పారు.

dilraju-new.jpg

జనవరి 12న మహేష్ బాబు (Mahesh Babu) సినిమా 'గుంటూరు కారం' #GunturKaaram కి నైజాంలో థియేటర్స్ వున్నాయి, 'హనుమాన్'కి వున్నాయి, కానీ పెద్ద స్టార్స్ అయిన నాగార్జున (Nagarjuna), వెంకటేష్ (Venkatesh) సినిమాలకి ఆరోజు థియేటర్స్ దొరకలేదు అని చెప్పారు దిల్ రాజు. తమిళ సినిమా నేను విడుదల చేస్తున్నాను అని రాశారు, కానీ నేను ఆ తమిళ సినిమా విడుదల వాయిదా వేయించాను. తెలియాకుండా ఇష్టమొచ్చినట్టు నా మీద లేనిపోని వార్తలు రాస్తే మరోసారి హెచ్చరిస్తున్నా, ఈరోజు నుండి 'తాట తీస్తా' అని చెప్పారు దిల్ రాజు.

మీరు తప్పుడు రాతలతో ఏం చేద్దామనుకుంటున్నారు, తాను అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటాను అని, మీరు నా గురించి వార్త రాసేటప్పుడు ఎటువంటి సందేహం వచ్చినా నాకు ఫోన్ చేస్తే మాట్లాడుతాను, నేను ఎప్పుడూ అందుబాటులో వుంటాను అని చెప్పారు దిల్ రాజు. మరోసారి చెపుతున్న మీ వైబ్ సైట్లకు నన్ను వాడుకుంటే 'తాటతీస్తా' అని చెప్పారు దిల్ రాజు.

Updated Date - Jan 08 , 2024 | 06:05 PM