Dil raju: చంపేస్తాయా? చంపలేవుగా ట్రోలింగ్స్‌పై దిల్‌ రాజు స్పందన!

ABN , Publish Date - Apr 05 , 2024 | 03:10 PM

తనపై వచ్చిన ట్రోలింగ్స్‌పై దిల్‌ రాజు (Dil raju) స్పందించారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ట్రోల్స్‌ గురించి ఆలోచించకూడదని అన్నారు. ట్రోల్స్‌పై తనదైన శైలిలో స్పందించారు.

Dil raju: చంపేస్తాయా? చంపలేవుగా ట్రోలింగ్స్‌పై దిల్‌ రాజు స్పందన!
Dil raju

తనపై వచ్చిన ట్రోలింగ్స్‌పై దిల్‌ రాజు (Dil raju) స్పందించారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ట్రోల్స్‌ గురించి ఆలోచించకూడదని అన్నారు. ట్రోల్స్‌పై తనదైన శైలిలో స్పందించారు. ‘‘నాకు గతంలో మీమ్స్‌ (memes) గురించి అవగాహన లేదు. నా పెళ్లి తర్వాత ఓ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాను. అందులో నా భార్యను (Dil raju Wife) ఎలా కలిశాను.. మా జర్నీ ఎలా మొదలైంది అన్నది చెప్పాను. ఆ వీడియోపై ట్రోల్స్‌ చేశారు. అవి నా భార్య చూపించింది. నేను వాటి గురించి పట్టించుకోను. తెలుగు రాష్ట్రాల్లో నన్ను గుర్తుపట్టేవారు కోటి మంది ఉంటారు. నాపై కామెంట్స్‌ చేసే వాళ్ళు పదివేల మంది ఉంటారేమో! ఇలా ట్రోల్స్‌, నెగెటివ్‌ కామెంట్స్‌ చేసే వాళ్ల గురించి పట్టించుకుంటే నేను మిగతా వాళ్లకు దూరమవుతాను. అందుకే నేను అలాంటి వాళ్ల గురించి ఎక్కువగా ఆలోచించను. నెగిటివిటీని మన దగ్గరకు రాకుండా జాగ్రత్తపడాలి. అయినా అవ్వన్నీ వస్తూపోతూ ఉండే మేఘాల్లాంటివి. వాటికి భయపడితే ఎలా? నేను ఆకాశం లాంటివాడిని. అవేమైనా చంపేస్తాయా? చంపలేవు కదా! అలాంటి మేఘాలన్నీ వెళ్లిపోయాక మనకు ఆకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది’ అన్నారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం తనకెంతో ప్రత్యేకమని చెప్పారు. 21ఏళ్ల క్రితం ఇదే రోజున ‘దిల్‌’ సినిమా విడుదలై తనకు మంచి గుర్తింపు తెచ్చిందని గుర్తు చేసుకున్నారు. మళ్లీ ఇన్నేళ్లకు అదే తేదీలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ రావడం ఆనందంగా ఉందన్నారు దిల్‌ రాజు.

Boney Kapoor: శ్రీదేవి ప్రైవేట్‌ పర్సన్ .. బయటకు చెప్పడం ఆమెకు నచ్చదు!

Updated Date - Apr 05 , 2024 | 03:38 PM