Dil Raju: పవన్‌ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే..

ABN , Publish Date - Dec 30 , 2024 | 11:55 AM

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో నిర్మాత దిల్‌ రాజు (Dil raju) భేటీ అయ్యారు.

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో (pawan Kalyan) నిర్మాత దిల్‌ రాజు (Dil raju) భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్‌ను ఆయన కలిశారు. రామ్‌చరణ్‌ (Ram Charan) కొత్త సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏపీలో నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని పవన్‌ను కోరారు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేస్తున్నారు

Pj.jpg

Updated Date - Dec 30 , 2024 | 11:55 AM