Dil Raju: ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో దిల్‌ రాజు కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 29 , 2024 | 04:42 PM

"ఛాంబర్‌ ఇచ్చిన మాట ప్రకారం 'ఈగల్‌' (Eagle) సినిమా ఫిబ్రవరి 9న సోలో రిలీజ్‌ అవుతుంది. ఏప్రిల్‌ 5న 'దేవర' (Devara) విడుదల కాకపోతే ఆ డేట్‌లో మా చిత్రం 'ఫ్యామిలీస్టార్‌’ వస్తుంది ’’ అని దిల్‌ రాజు అన్నారు.

Dil Raju: ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో దిల్‌ రాజు కీలక వ్యాఖ్యలు

"ఛాంబర్‌ ఇచ్చిన మాట ప్రకారం 'ఈగల్‌' (Eagle) సినిమా ఫిబ్రవరి 9న సోలో రిలీజ్‌ అవుతుంది. ఏప్రిల్‌ 5న 'దేవర' (Devara) విడుదల కాకపోతే ఆ డేట్‌లో మా చిత్రం 'ఫ్యామిలీస్టార్‌’ వస్తుంది ’’ అని దిల్‌ రాజు అన్నారు. సోమవారం తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌, తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ సంయుక్తంగా సమావేశం అయింది. ఫిల్మ్‌ ఛాంబర్‌ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో దిల్‌రాజు మాట్లాడుతూ "ముందు అనుకున్నట్లుగానే ఈగల్‌ సినిమా ఫిబ్రవరి 9న సోలో రిలీజ్‌ అవుతుంది. అదే రోజున అనుకున్న 'ఊరు పేరు భైరవకోన’ నిర్మాత రిలీజ్‌ డేట్‌ మార్చుకున్నారు. ఫిబ్రవరి 16న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 'యాత్ర నిర్మాతను కూడా సంప్రదించాం. వాళ్లు మా మాట వినలేదు. 'లాల్‌ సలాం’ నిర్మాతలు కూడా విడుదల వాయిదా వేయలేం అన్నారు. ఇదే విషయాన్ని 'ఈగల్‌' నిర్మాతలు చెప్పాం. వాళ్లు ఎలాంటి సమస్య లేదన్నారు. మెజారిటీ థియేటర్స్‌ ఈగల్‌కు వుంటాయి.

ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డిగారిని కలిశాం. సినీ పరిశ్రమకు సంబంధింది సమస్యలు, వాటికి పరిష్కారం కూడా చెప్పాలన్నారు. పరిశ్రమ సమస్యలపై ఛాంబర్‌ ఎగ్జిక్యూటివ్‌ బాడీ మీటింగ్‌లో సమష్టిగా నిర్ణయం తీసుకుంటాము. అందులో అందరినీ కలుపుకొని సమస్యలను పరిష్కరించుకుంటాము. నెక్ట్స్‌ టర్మ్‌ నేను ప్రెసిడెంట్‌ గా ఉండాలనుకోవడం లేదు. ఈ రోజు ఛాంబర్‌ తరఫున అంతా కలిసి చిరంజీవిగారిని కలుస్తాం. ఆయన్ను ఘనంగా సన్మానించాలనుకుంటున్నాం. ఈ వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని అన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 04:42 PM