మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Love Me: దిల్ రాజు.. ‘ల‌వ్‌మీ’ వాయిదా! అందుకేనా

ABN, Publish Date - Apr 24 , 2024 | 12:22 PM

ఆశిష్ రెడ్డి క‌థానాయ‌కుడిగా బేబీ ఫేం వైష్ణ‌వి చైత‌న్య క‌థ‌నాయిక‌గా రూపొందిన చిత్రం లవ్ మీ చిత్రం విడుద‌ల వాయిదా ప‌డింది.

love me

దిల్ రాజు (Dil Raju) తన సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి (Ashish) క‌థానాయ‌కుడిగా బేబీ ఫేం వైష్ణ‌వి చైత‌న్య (Vaishnavi Chaitanya) క‌థ‌నాయిక‌గా రూపొందిన చిత్రం లవ్ మీ (Love Me). ఇప్ప‌టికే అనే విడుదలకు సిద్ధ‌మైన ఈ చిత్రం వాయిదా ప‌డింది. సిద్ధం చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 25న విడుద‌ల చేస్తున్నామంటే అంత‌కుముందే ప్ర‌క‌టించి కాస్త హ‌డావుడి కూడా చేసిన మేక‌ర్స్ తాజాగా చిత్రం విడుద‌ల వాయిదా వేస్తూ కొత్త రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించారు.

ఈ సినిమాకి అరుణ్ భీమవరపు (Arun Bhimavarapu) దర్శకుడు కాగా, పెద్ద పెద్ద సాంకేంతిక నిపుణలని దిల్ రాజు ఈ లవ్ మీ (Love Me) సినిమా కోసం తీసుకు వచ్చారు. దేశంలో అత్యున్నత ఛాయాగ్రాహకుడైన పీసీ శ్రీరామ్ ఈ చిత్రానికి ప‌ని చేయ‌గా, ఆస్కార్ అవార్డు గ్రహీత, సీనియర్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (MM Keeravaani) ఈ చిత్రానికి సంగీతం అందించగా అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేశారు.


ప్ర‌స్తుతం రెండు రాష్ట్రాల‌లో ఎన్నిక‌ల‌ హంగామా, విపరీతమైన ఎండలు, దానికి తోడు ఐపీఎల్ క్రికెట్ మ్యాచులు ఒక దానితో పోటీ ప‌డి మ‌రోటి ఇలా చాలా అడ్డంకులు ఎదుర‌వుతుండ‌డంతో సినిమా చూడటానికి ప్రేక్షకులు వస్తారా అని చిన్న సందేహంతో వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. ఈ హ‌డావుడి అంతా ముగిశాక మే 25న లవ్ మీ (Love Me) సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు.

Updated Date - Apr 24 , 2024 | 12:22 PM