శ‌త‌మానంభ‌వ‌తికి సీక్వెల్.. ప్ర‌క‌టించిన దిల్ రాజు! విడుద‌ల ఎప్పుడంటే

ABN , Publish Date - Jan 15 , 2024 | 11:59 AM

2017 సంక్రాంతికి చిన్న చిత్రంగా వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యం సాధించిన సినిమా శ‌త‌మానంభ‌వ‌తి. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు తదీనికి సీక్వెల్ తీయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ సంక్రాంతి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఈరోజు అధికారికంగా ప్ర‌క‌టించారు.

శ‌త‌మానంభ‌వ‌తికి సీక్వెల్.. ప్ర‌క‌టించిన దిల్ రాజు! విడుద‌ల ఎప్పుడంటే
dil raju

2017 సంక్రాంతికి చిన్న చిత్రంగా వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యం సాధించిన సినిమా శ‌త‌మానంభ‌వ‌తి (Shathamanam Bhavathi). మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు తదీనికి సీక్వెల్ తీయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ సంక్రాంతి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఈరోజు అధికారికంగా ప్ర‌క‌టించారు. శ్రీవేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్ రాజు ఈ సినిమాను న‌ర్మించ‌గా వేఘేశ్న స‌తీష్ ద‌ర్శ‌కత్వం వ‌హించారు. శ‌ర్వానంద్, అనుప‌మ జంట‌గా ప్ర‌కాష్ రాజ్‌,జ‌య‌సుధ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు తిర‌గ‌రాసింది. ఓ జాతీయ అవార్డుతో పాటు నంది, ఫిలింఫేర్ అవార్డుల‌ను సైతం కైవ‌సం చేసుకుంది.


శ‌త‌మానం భ‌వ‌తి చిత్రం విడుద‌లైన ఏడు సంవ‌త్స‌రాల త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు సంక్రాంతి పండుగ రోజే శ‌త‌మానం భ‌వ‌తి (Shathamanam Bhavathi) కి సీక్వెల్ శ‌త‌మానం భ‌వ‌తి నెక్ట్స్ పేజీ అంటూ సినిమా టైటిల్‌ను ప్ర‌క‌టించ‌డంతో పాటు వ‌చ్చే సంక్రాంతికి విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్‌ ఎనౌన్స్ చేసింది. దీంతో ఇప్పుడు ఈసినిమా వార్త‌ల్లో నిలిచింది. అయితే ఈ సినిమాకు ద‌ర్శుడు ఎవ‌ర‌నేది రివీల్ చేయ‌లేదు. మొద‌టి చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హించిన స‌తీష్ చేస్తాడా లేక మ‌రోక‌రు కొత్త వ్య‌క్తి ద‌ర్శ‌క‌త్వం చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Jan 15 , 2024 | 11:59 AM