కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tantra: అనన్య నాగళ్ళ ‘తంత్ర’ నుంచి అద్భుత మెలోడీ.. విడుద‌ల చేసిన‌ పాయల్, అనసూయ

ABN, Publish Date - Jan 12 , 2024 | 05:08 PM

అనన్య నాగళ్ళ, ధనుష్ రఘుముద్రి, సలోని ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా ‘తంత్ర’. ఈ సినిమా నుంచి ధీరే ధీరే అంటూ సాగే ఫస్ట్ మెలోడీ సాంగ్‌ను శుక్ర‌వారం పాయల్ రాజ్‌పుత్, అనసూయ విడుద‌ల చేశారు.

tantra

అనన్య నాగళ్ళ (Ananya Nagalla), ధనుష్ రఘుముద్రి (Dhanush Raghumudri), సలోని (Salloni), టెంపర్ వంశి మరియు మీసాల లక్ష్మణ్ ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా ‘తంత్ర’(Tantra). ఫస్ట్ కాపీ మూవీస్ మరియు బి ద వే ఫిల్మ్స్ బ్యానర్లపై నరేష్ బాబు పి, రవిచైతన్య నిర్మాతలుగా, శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ధీరే ధీరే (Dheere Dheere) అంటూ సాగే ఫస్ట్ సాంగ్ రిలీజ్ విడుద‌ల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి, ప్రొడ్యూసర్స్ మాట్లాడుతూ గతంలో మేం రిలీజ్ చేసిన ఫస్ట్-లుక్‌, టీజర్‌ల‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ కామెంట్స్ ఇస్తూ, కాన్సెప్ట్ డిఫరెంట్‌గా ఉంద‌ని మెచ్చుకోవడం మాకు మంచి ధైర్యాన్నిస్తోందని అతి త్వరలో ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నాం అన్నారు. ట్రైలర్‌లో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ రివీల్ అవుతాయని, మా ప్రొడ్యూసర్స్ నరేష్ బాబు మరియు రవిచైతన్య ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా అడిగింది వెంటనే ఏర్పాటు చేస్తూ చాలా బాగా సహకరించారన్నారు.


గతంలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన అనురాగ్ కులకర్ణి (Anurag kulkarni) గారు ఈ సాంగ్ పాడడం సాంగ్ కి చాలా ప్లస్ అయ్యిందని, ఎంతో బిజీగా ఉన్నా అడగగానే కాదనకుండా ఈ సాంగ్ రిలీజ్ చేసిన పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput), అనసూయ (Anasuya)ల‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాగే ప్రేక్షకుల ఆదరణ మా తంత్ర సినిమా పైన, మా పైన ఉండాలని.. సినిమాను మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నామన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 05:08 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!