Kubera: ధనుష్, నాగార్జున 'కుబేర' మేజర్ యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం

ABN , Publish Date - Jun 02 , 2024 | 07:12 PM

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున , శేఖర్ కమ్ముల కాంబినేష‌న‌ల్‌లో వ‌స్తోన్న‌ మోస్ట్ అవైటెడ్ మైథలాజికల్ పాన్-ఇండియన్ మూవీ కుబేర మెయిన్ యాక్షన్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్ర‌స్తుతం హైదరాబాద్‌లో వేసిన ప్ర‌త్యేక‌ సెట్స్‌లో షూటింగ్ జరుగుతోంది.

Kubera: ధనుష్, నాగార్జున 'కుబేర' మేజర్ యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం
kubera

కాంబినేష‌న‌ల్‌లో వ‌స్తోన్న‌ మోస్ట్ అవైటెడ్ మైథలాజికల్ పాన్-ఇండియన్ మూవీ కుబేర (Kubera) మెయిన్ యాక్షన్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్ర‌స్తుతం హైదరాబాద్‌లో వేసిన ప్ర‌త్యేక‌ సెట్స్‌లో షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు టాకీ పార్ట్‌లు పూర్తయ్యాయి. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్‌ని డైరెక్టర్ చేయడం, ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లీడ్ లో నటించడం, ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించడంతో కుబేర ఇప్పటికే దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.

kubera.jpg

రష్మిక మందన్న (Rashmika Mandanna), జిమ్ సర్భ్ ఇతర ప్రముఖ పాత్రల్లో కనిపించనున్న ఈ హై-బడ్జెట్ సోషల్ డ్రామా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏక కాలంలో జరుగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఈ షెడ్యూల్‌లో ధనుష్ (Dhanush), నాగార్జున(Nagarjuna)ల మ‌ధ్య పోరాట దృశ్యాలు చిత్రీక‌రిస్తున్నారు.అంతేకాకుండా దాదాపు అంద‌రు న‌టీన‌టులు ఈ షెడ్యూల్లో పాల్గొంటుండ‌డం విశేషం.


kubera.jpg

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (Sree Venkateswara Cinemas LLP), అమిగోస్ క్రియేషన్స్ (Amigos Creations) ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తోన్న ఈ ఇత్రం పాన్ ఇండాయాగా వ‌స్తుండ‌గా మల్టీ లాంగ్వేజ్ మూవీ. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఒకే స‌మ‌యంలో షూట్ చేస్తున్నారు.

Updated Date - Jun 02 , 2024 | 07:13 PM