Dhanush: పది గంటలపాటు మాస్క్‌ లేకుండా...

ABN , Publish Date - May 06 , 2024 | 01:02 PM

హీరో ధనుష్‌కి (Dhanush) సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. తాజాగా ఆయన నటిస్తున్న 'కుబేర’ (kubera) చిత్రం షూటింగ్‌ ముంబైలో అత్యంత పెద్ద డంప్‌యార్డ్‌లో ప్లాన్  చేశారట.

Dhanush: పది గంటలపాటు మాస్క్‌ లేకుండా...


హీరో ధనుష్‌కి (Dhanush) సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. తాజాగా ఆయన నటిస్తున్న 'కుబేర’ (Kubera) చిత్రం షూటింగ్‌ ముంబైలో అత్యంత పెద్ద డంప్‌యార్డ్‌లో ప్లాన్  చేశారట. ఆ సన్నివేశాలు సహజంగా రావడం కోసం ధనుష్‌ 10 గంటల సేపు మాస్క్‌ కూడా లేకుండా డంప్‌యార్డ్‌లో (shoot in Dumpyard) నటించారని సినీవర్గాలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాయి. దీనిని గమనించిన నెటిజన్లు, అభిమానులు ధనుష్ ను ప్రశంసలతో ముంచేస్తున్నారు. సినిమాపై ఆయనకున్న నిబద్థతను నెటిజన్లు కొనియాడుతున్నారు. నాగార్జున మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ధనుష్‌ డీగ్లామర్‌ రోల్‌లో కనిపించనున్నారు. శేఖర్‌ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కొద్ది రోజుల క్రితం తిరుపతిలో ఈ సినిమా షూటింగ్‌ జరిగింది. ప్రస్తుతం ముంబైలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇటీవల నాగార్జున లుక్‌ విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది.

Kubera.jpg

సున్నితమైన అంశాలతో, మనసుల్ని హత్తుకునేలా కథలు చెప్పడం శేఖర్‌ కమ్ముల శైలి. ‘కుబేర’తో తనదైన శైలిలో ఫిలాసఫీ డ్రామా చెప్పబోతున్నారు.. వాణిజ్య హంగుల్ని మేళవించి ఆయన తన మార్క్‌ కథ, కథనాల్ని తెరపై ఆవిష్కరించనున్నారు. దీంతో ఈ సినిమాలో ధనుష్‌, నాగార్జునల పాత్రలు ఎలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. రష్మిక కథానాయిక ఈ చిత్రంలో కథానాయిక.

Read More: Tollywood, Cinema News

Updated Date - May 06 , 2024 | 01:17 PM